ETV Bharat / state

బుడతలూ! - ఈ నలుగురి స్నేహితులను మీ ఫ్రెండ్స్​ లిస్ట్​లో చేర్చుకొండి - CHILDREN SUMMER ACTIVITIES

పిల్లలకు వేసవి సెలవులు - ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారో తెలుసుకొండి - ఇలాంటి పనులు చేయమని చెప్పండి - భవిష్యత్తులో ఎలాంటి ఢోకా ఉండదు

Summer  Activities for Kids
Summer Activities for Kids (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2025 at 8:56 PM IST

4 Min Read

Most Popular Summer Activities for Childrens : హాయ్​ మనకు చదువుకునేచోట, ఆడుకునేచోట నేస్తాలు ఉంటారు కదా! అలాగే మన లోపల కూడా ఉంటారు తెలుసా? అంటే మనం నేర్చుకునే కొన్ని మంచి లక్షణాలే మనకు స్నేహితులన్నమాట. మరి ఈ సెలవుల్లో ఈ సోషల్‌ స్కిల్స్‌తో దోస్తీ చేద్దామా! ఇవి పాటించిన తర్వాత మరి ఈ 4 ఫ్రెండ్స్‌ను వెంటనే మీ ఫ్రెండ్‌లిస్ట్‌లోకి చేర్చేయండి! అవి ఏంటో చూసేద్దామా మిత్రమా? నీ చుట్టూ నలుగురు ఉంటే ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు. అదే గుర్తించుకో, నలుగురికి చెప్పు.

నిబంధనలు పాటించండి : మనం ఎక్కడికి వెళ్లినా కొన్ని సెట్‌ ఆఫ్‌ రూల్స్‌ అంటూ ఉంటాయి. వాటిని కచ్చితంగా ఫాలో కావడం నేర్చుకోవాలి. ట్రాఫిక్, స్కూల్, గేమ్స్‌, ఇలా ఎక్కడైనా సరే వాటిని మీరకూడదు.

పాజిటివ్​- సెల్ఫ్​ టాక్​ : మన గురించి మనం ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడుకోవడం అవసరం. ఫ్రెండ్స్‌తో గొడవ అయినా, ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వచ్చినా ఎప్పుడూ నిరాశ పడకూడదు. హ్యాపీగా, పాజిటివ్‌గా ఉండేందుకు ట్రై చేయాలన్నమాట.

సెల్ఫ్​ కంట్రోల్​ : మనకు చాలాసార్లు కోపం వస్తూ ఉంటుంది. ఎవరిమీద అయినా గట్టిగా అరిచేయాలి అనిపిస్తుంది. కానీ అలా చేయకపోవడమే సెల్ఫ్‌ కంట్రోల్‌. మన ఫీలింగ్స్‌ను వెంటనే మాటల్లో చూపించేయకుండా ఉండటం. కాసేపు ఆగి ఆలోచిస్తే కోపం తగ్గుతుంది తెలుసా!

సరికొత్త ఆలోచనలు : కొత్తగా ఆలోచించడం, ఐడియాలను డెవలప్‌ చేయడం.. ఇన్నోవేటివ్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఏదైనా అందరికీ భిన్నంగా ట్రై చేయాలి.

ప్రకృతిలో హాయ్​.. హాయ్​గా ఎంజాయ్​ చేయొచ్చు తెలుసా? : పిల్లలూ మీరెప్సుడైనా నేచర్‌ వాక్‌ చేశారా? ఈ సెలవుల్లో అమ్మ, నాన్నలను తీసుకుని మీకు సమీపంలోని అర్బన్‌ పార్క్‌కో, ఎకో పార్క్‌కో, అటవీ ప్రాంతానికో వెళ్లండి. అక్కడ స్వచ్ఛమైన ప్రకృతిలో హాయిగా నడవండి. ఎందుకంటే ఇలా చేయడం మనకు చాలా విధాలుగా మంచి చేస్తుందట. నడక బ్యాలెన్స్‌ మెరుగవడంతోపాటు ఈ నేచర్‌తో ఫ్రెండ్‌ షిప్‌ ఏర్పడుతుందట!

మనం ఇప్పుడు ఎదిగే టైమ్‌ కదా ఇలాంటప్పుడు చాలా రకాలైన మెంటల్, మోటార్‌ స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోవడంలో ఇది సహాయం చేస్తుందని పెద్ద పెద్ద సైంటిస్టులు బోలెడన్ని పరిశోధనలు చేసి చెప్పారు. మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బూస్ట్‌ చేసే ఈ వాక్‌ను అమ్మానాన్నలతో కలిసి చేస్తే ఇంకా సరదాగా ఉంటుంది కదా! ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరి. అయితే ఇలా నడిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సుమా!

పెట్‌తో మాట్లాడితే ఎలా ఉంటుంది : రోజూ కొత్త ఆటలు ఆడుతున్నాం కదా. సరదాగా ఈ టాస్క్‌ చేసి చూద్దామా. మీ పెట్‌కి కనుక మాటలు వస్తే అది మీతో, అమ్మతో, నాన్నతో ఇంకా ఇంట్లో అందరితో ఏం మాట్లాడుతుందో మీరే ఊహించి రాయండి. అలాగే మీరు తనతో ఏం కబుర్లు చెబుతారో కూడా ఆలోచించండి. అలాగే పెట్స్‌ అంటే మనకు ఏంతిష్టమో, వాటికి మనం ఇంకా ఇష్టమని మీకు తెలుసా! అందుకే వాటితో చాలా ప్రేమగా ఉండాలి. అవే కాదు వీధి జంతువులు అయినా సరే వాటితో దయతోనే మెలగాలి. చేస్తారా మరి ఇలాంటి పనులు పిల్లలూ!

సైకిల్‌ శుభ్రం చేసేయండి :

  • మనం రోజూ నీట్‌గా స్నానం చేసి రెడీ అవుతున్నాం కదా. అలాగే మన వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి సెలవుల్లో వాటిని ఎంచక్కా పెట్టుకోవడం ప్రాక్టీస్‌ చేద్దామా!
  • ఈ వారమంతా మీరు వాడే డ్రెస్‌లను ఎంపిక చేసుకుని వాటిని నీట్‌గా సర్దుకోండి. బట్టలను మీరే ఇస్త్రీ చేసుకోవడం నేర్చుకుంటే అమ్మ, నాన్నలకు శ్రమ, ఖర్చు రెండూ తగ్గుతాయి.
  • మీ పుస్తకాలను ర్యాక్‌లలో అందంగా సర్దేయండి. టెక్ట్స్‌ బుక్స్, నోట్స్, అస్సైన్‌మెంట్స్, మ్యాప్స్, జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలు, న్యూస్‌పేపర్స్‌ అన్నీ క్రమ పద్ధతిలో పెట్టుకోండి. వాటికి ట్యాగ్స్‌ కూడా వేసేయండి. ఇక మీకు ఉపయోగపడనివి ఉంటే మీ తర్వాత ఆ తరగతికి వచ్చే పిల్లలకు ఇచ్చేయండి.
  • ఆడుకున్న బొమ్మలు, బ్యాట్‌లు, బాల్స్‌ను ఇంట్లో ఎక్కడబడితే అక్కడ పడేయకండి. దీనివల్ల అవి కూడా పాడవుతాయి. వాటికో ప్లేస్‌ కేటాయించి అక్కడే ఉంచండి.
  • మన సైకిల్‌ అంటే మనకు చాలా ఇష్టం. దాని మీదే ఫ్రెండ్స్‌తో కలిసి చక్కర్లు కొడుతుంటాం. అంత ఇష్టమైన దాన్ని భద్రంగా చూసుకోవాలి కదా. అందుకే నెలకు ఒక్కసారి అయినా శుభ్రంగా కడగడం అలవాటు చేసుకుందాం. వీలైనప్పుడల్లా దుమ్ములేకుండా తుడుద్దాం.
  • ఇంకా చాక్లెట్‌ తిన్నాక కవర్లను, తాగేశాక వాటర్‌ బాటిల్స్‌ను డస్ట్‌బిన్‌లో వేయడం.. అలవాటు చేసుకోండి. ఇలాచేస్తే మన ఇల్లు చాలా నీట్‌గా ఉంటుంది.

రంగులే మేలు చేస్తాయి : రంగులను చూస్తే చాలు మనకు పెయింటింగ్​ వేసేయాలి అనిపిస్తుంది. ఎరుపు, పచ్చ, పసుపు, నీలం, నారింజ ఇలా బోలెడన్ని కలర్స్‌తో వేసే పెయింటింగ్స్‌ను కేవలం పేపర్‌ మీదే కాదు. ఇంకా వేరే చోట్ల కూడా వేయొచ్చు!ఈ సెలవుల్లో సరదాగా రాక్‌ పెయింటింగ్‌ ట్రై చేస్తే కొత్తగా ఉంటుంది. ఇందుకోసం రకరకాలైన చిన్ని చిన్ని రాళ్లను, గుండ్రంగా నున్నగా ఉండేవాటిని సేకరించి.. వాటి మీద చక్కని బొమ్మలు గీయవచ్చు. అలాగే చెక్కల మీద కూడా ట్రై చేయవచ్చు. ఇంకా ఎన్ని కొత్త రకాలుగా పెయింటింగ్‌ వేసే వీలుందో మీరు కూడా ఆలోచించండి!

నేను ఎవరు : గాల్లో ఉంటాను కానీ రెక్కల్లేవు. ఏడవగలను కానీ కళ్లు లేవు. ఎవరు నేను? - మేఘం

పిల్లలూ! స్నేహమేరా జీవితం - టీమ్ వర్క్​తో అద్భుత విజయాలు మీ సొంతం

పిల్లలూ మీరు ధ్యానం చేస్తారా? - మెడిటేషన్​తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.