TDP finalized Kovelamudi Ravindra as Mayor of Guntur: గుంటూరు మేయర్ ఎన్నిక ఈనెల 28న జరగనుండగా ఆ పదవికి కోవెలమూడి రవీంద్ర పేరును తెలుగుదేశం ఖరారు చేసింది. వైఎస్సార్సీపీ నేత కావటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జిగా ఉన్న రవీంద్ర గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఆశించారు. అనూహ్యంగా గల్లా మాధవికి టికెట్ ఇచ్చినందున మరో విధంగా న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు రవీంద్రకు అప్పట్లో హామీ ఇచ్చారు.
ఈ మేరకు మేయర్ పదవికి కోవెలమూడి రవీంద్ర పేరును ఖరారు చేయడం గమనార్హం. గుంటూరు నగరపాలికలో 57 స్థానాలుండగా ఒకటి ఖాళీగా ఉంది. మిగతా 56 స్థానాల్లో తెలుగుదేశానికి 23మంది, జనసేనకు ఆరుగురు కార్పొరేటర్ల చొప్పున ఉన్నారు. మరో ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశానికి ఉన్నందున కోవెలమూడి రవీంద్ర ఎన్నిక లాంఛనం కానుంది.