NDDB LAB Report on TTD Ghee: వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు. నివేదికల్లో పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తూ, జగన్‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విడుదల చేశారు. YSRCPపాలనలోఉపయోగించిననెయ్యిలో జంతువుల కొవ్వుఉన్నట్లు కేంద్ర ప్రభుత్వంద్వారా గుర్తింపు పొందినల్యాబ్ నిర్ధారించింది.YSRCPపాలనలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది. జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఈ మేరకు ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.
ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB CALF ల్యాబ్ ద్వారా వైఎస్సార్సీపీ బండారం బట్టబయలైందన్నారు. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని, ఆధారాలతో సహా నిరూపించారు.
నాణ్యమైన నెయ్యికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు. నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్టు ఇచ్చారని, నాణ్యమైన నెయ్యి రూ.320కి ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. లంచాల కోసం 15 వేల కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారన్న ఆనం, ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్ సర్టిఫికేషన్ లేదన్నారు.
నెయ్యి సర్టిఫికేషన్‌కు రూ.75 లక్షలతో ల్యాబ్ పెట్టే పరిస్థితిలో లేరా అని నిలదీశారు. నెయ్యి విషయమై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసిందన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తేలిందన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు నివేదికలో వెల్లడైందని తెలిపారు.
"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి తిరుమలలో లడ్డూలు వాసన వస్తున్నాయి అని ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. నెయ్యి సరఫరా చేసే వాళ్లని మార్చేశారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కి చెందిన నందిని నెయ్యిని మార్చేశారు. ఎందుకంటే కర్ణాటక వాళ్లు లంచాలు ఇవ్వరు కాబట్టి. ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. నాణ్యమైన నెయ్యి వెయ్యికి పైగా ఖర్చవుతుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 320కి నెయ్యి టెండర్లు పిలిచి, వారికి ఇచ్చేశారు. నాణ్యమైన నెయ్యి 320కే ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అనే నేను అడుగుతున్నాను. లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లై చేసే వాళ్లు తప్పు చేశారు. టీటీడీకి 75 లక్షల రూపాయలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? రుజువులు కావాలి అని అన్నారు కదా, ఇదిగోండి రుజువులు. ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. వెంటనే దీనిపైన విచారణ ఉంటుంది". - ఆనం వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం నేత
వైఎస్సార్సీపీ నేతలు తిరుమల లడ్డూనూ అపవిత్రం చేశారా? - రాజకీయ దుమారం - FAT IN TIRUMALA LADDU ISSUE