Palla Srinivasarao about TDP:నాలుగు దశాబ్దాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పాలనా పరంగా అత్యుత్తమంగా నిలుస్తోందని, దీనికి ప్రధాన కారణం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ, సమాజంలో సమానత్వం కోసం టీడీపీ పనిచేస్తోందని అన్నారు.
విజయనగరం నగర పాలక సంస్థ కార్యాలయం కూడలిలో టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత నందమూరి తారక రామారావు నూతన కాంస్య విగ్రహాన్ని పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు, "ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయ్యారు. సమ సమాజ స్థాపనే ఆయన లక్ష్యం. అందుకే ఆయన టీడీపీని ప్రారంభించారు. టీడీపీ అంటే నాయకులను తయారు చేసే ఒక శిక్షణా క్షేత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రధాన రాజకీయ నాయకుల మూలాలు టీడీపీలోనే ఉన్నాయి," అని తెలిపారు.
పార్టీ యువ నాయకుడు నారాలోకేశ్ తన తండ్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో పాలన నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్‌లో ఆయన నుంచి మరిన్ని అద్భుతాలు చూడవచ్చని పల్లా చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో 144 ఎకరాల్లో జరగబోయే మహానాడు మహాసభలను టీడీపీ ఎంతో వైభవంగా నిర్వహించబోతోందని తెలిపారు. మహానాడులో తీసుకునే కీలక తీర్మానాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్‌లో మార్పులు - ఇకపై ప్రతి శుక్రవారం
జగన్, విజయసాయిరెడ్డి డ్రామాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్లా శ్రీనివాసరావు