ETV Bharat / state

ఈత సరదా కారాదు విషాదం - ఈ జాగ్రత్తలు తప్పనిసరి - SWIMMING POOL RULES AND REGULATIONS

వేసవిలో ఈత కొలనుకు వెళ్తున్న చిన్నారులు - జాగ్రత్తలు పాటించని నిర్వాహకులు - పాటించాల్సిన నిబంధనలు ఏంటంటే?

Swimming Pool Rules and Regulations
Swimming Pool Rules and Regulations (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 15, 2025 at 4:49 PM IST

2 Min Read

Swimming Pool Rules and Regulations in Telugu : ఈత అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి, సరదా అయితే ఈత వచ్చిన వారు, నేర్చుకునే వారు ప్రమాదాలు, వ్యాధులకు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. గ్రామాల్లో కుంటలు, చెరువులు, బావులు పట్టణ ప్రాంతాల్లో ఈత కొలనులో స్విమ్మింగ్​ నేర్చుకునేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు. ఈత కొలను నిర్వహణకు ప్రభుత్వం ప్రమాణాలను, నిబంధనలను నిర్దేశించింది.

లైవ్‌గార్డ్స్‌ ఏర్పాటు : చాలా ప్రాంతాల్లో ఈత కొలనుల నిర్వహణలో పూర్తి స్థాయి నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈత కొలనుల పరిశుభ్రత, నీటి శుద్ధీకరణ, స్నానాల రూమ్​ నిర్వహణ సక్రమంగా ఉండాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా నిబంధనల సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులు నిబంధనలు ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల రక్షణ పరికరాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన శిక్షకులు లేకపోగా, స్విమ్మింగ్ వచ్చిన స్థానికులతోనే వెళ్లదీస్తున్నారు. పూల్స్ వద్ద ప్రత్యేకంగా లైవ్‌గార్డ్స్‌ను ఏర్పాటు చేయాలి. ప్రధానంగా వేసవి కాలంలో ఎక్కువ మంది పిల్లలు వస్తుండగా మరింత అప్రమత్తంగా ఉండాలి.

స్విమ్మింగ్ పూల్ నిర్వహకులు పాటించాల్సిన నిబంధనలు :

  • స్విమ్మింగ్ పూల్​ లోతు ఒక వైపు 3 అడుగులు, మరో వైపు అత్యధికంగా 5.5 అడుగులు మాత్రమే ఉండాలి.
  • చర్మ సంబంధిత, ఇతర వ్యాధులకు అవకాశం లేకుండా ప్రమాణాల మేరకు స్విమ్మింగ్​లోని నీటిని ఆధునిక పరికరాల సహాయంతో నిరంతరం శుద్ధి చేయాలి. చెత్తా చెదారం నిత్యం తొలగించి నీటిని పరిశుభ్రంగా ఉంచాలి.
  • స్విమ్మింగ్ పూల్​లో ప్రమాదాల బారిన పడకుండా నిబంధనలతో కూడిన బోర్డు, లేదా ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి.
  • స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి కనీస వయసు 8 సంవత్సరాలు ఉండాలి. 8 సంవత్సరాలలోపు వారికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రవేశం కల్పించరాదు.
  • జూనియర్‌ నేషనల్, సీనియర్‌ నేషనల్, స్కూల్‌ గేమ్స్‌ నేషనల్‌లో పాల్గొనడంతో పాటు, ఏడాది, లేదా ఆరు వారాల పాటు శిక్షణ పొంది డిప్లొమా ధ్రువపత్రం కలిగిన శిక్షకులు ఉండాలి.
  • లైఫ్‌ జాకెట్లు ధరించిన ఇద్దరు లైవ్‌గార్డులు నిరంతర పర్యవేక్షణ చేయాలి.
  • స్విమ్మింగ్ చేస్తున్న టైంలో ఎవరికైనా అనుకోని ప్రమాదం జరిగితే, ఈత రాని, బయట ఉన్నవారు అప్పటికప్పుడు సహాయం చేసేలా ఒక పొడుగాటి కర్రను వారికి అందుబాటులో ఉంచాలి.

స్విమ్మింగ్‌ ఫూల్‌లో విద్యుదాఘాతం - 16 మందికి గాయాలు, ఇద్దరికి సీరియస్

క్లాస్​ రూమ్​లోనే స్విమ్మింగ్​ పూల్​- విద్యార్థులంతా ఫుల్​ ఖుషీగా ఆడుకుంటూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.