Young Woman Dies Suspiciously in Chittoor: చిత్తూరు నగరంలోని మసీదుమిట్టలో యువతి యాస్మిన్‌భాను అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మృతిపై భర్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
వివరాల్లోకి వెళితే నగరంలోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ, ముంతాజ్ దంపతుల మూడో కుమార్తె యాస్మిన్ భాను. అయితే ఈమెకు గత నెల ఫిబ్రవరి 9వ తేదీ రామ్‌నగర్ కాలనీకి చెందిన షరీఫ్‌తో పెళ్లి నిశ్చయించారు. 6వ తేదీన యాస్మిన్ ప్రేమికుడు సాయి తేజతో వెళ్లిపోయి రహస్యంగా వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ తిరుపతి ఎమ్మార్పల్లి పోలీస్టేషన్లో ఈ జంట ఫిర్యాదు చేశారు. పోలీసుల కౌన్సిలింగ్‌తో అప్పటికి విషయం సద్దుమణిగి సాయితేజ్, యాస్మిన్లు పూతలపట్టులో కొత్తకాపురం పెట్టారు. మరో వైపు కూతురు ప్రేమ పేరుతో వెళ్లిపోవడం బంధువుల మధ్య అవమానంగా భావించిన యాస్మిన్ తండ్రి షౌకత్ అలీ మానసికంగా కుంగిపోయారు.
వీడియో కాల్లో తన తండ్రి ధీన స్థితిని చూసి తట్టుకోలేక పుట్టింటికి వెళ్లి తండ్రిని చూడాలని భర్త సాయి తేజ్‌తో యాస్మిన్ కోరింది. ఈ క్రమంలో యాస్మిన్‌ను తీసుకుని చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చేరుకున్న సాయితేజ్ అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేక యాస్మిన్‌ను సమీప బంధువులకు అప్పగించాడు. కొద్ది సేపటికే తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఫోన్ రావటంతో పరుగున అత్తారింటికి వెళ్లగా ఇక్కడ కాదు ఆసుపత్రిలో ఉన్నారని స్థానికులు తెలిపినట్లు సాయి తేజ చెబుతున్నారు. అక్కడ నుండి హాస్పిటల్‌కు వెళ్లిన సాయి తేజ్‌కు యాస్మిన్ విగత జీవిగా పడి కనిపించింది.
షౌకత్ అలీ యాస్మిన్‌ను మందలించి ఇంటి నుంచి వెళ్లిపోయాడని అది చూసి మనస్తాపానికి గురైన యాస్మిన్ చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని యాస్మిన్ తల్లి సాయితేజ్‌కు తెలిపింది. హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు యాస్మిన్ తల్లి ముంతాజ్ వాంగ్మూలంతో విచారణ ప్రారంభించారు. ఉరి వేసుకున్న ఆనవాలు ఇంట్లో లేక పోవటం, యాస్మిన్ మృతదేహం ఆసుప్రతి చేరే వరకు గోప్యత పాటించడం, యాస్మిన్ తండ్రి, సమీప బంధువులు అందరూ పరారీ ఉండటంతో పోలీసులు పరువు హత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు. యాస్మిన్ తండ్రి దొరికితే కానీ కేసు కొలిక్కి రాదని పోలీసులు చెప్తున్నారు.
పిల్లలు ఏడుస్తున్నా, చనిపోయే దాకా భార్యను కొట్టిన భర్త! పారిపోయినా వదల్లేదు!