ETV Bharat / state

ఏపీ డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌ -సుప్రీంకోర్టు ఆదేశాలు - SUPREME COURT ON AP DSC SCHEDULE

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

supreme_court_verdict_on_dsc_schedule
supreme_court_verdict_on_dsc_schedule (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2025 at 7:41 PM IST

1 Min Read

Supreme Court Verdict on DSC Schedule in Andhra Pradesh : రాష్ట్రంలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

మెగా డీఎస్సీకి 5.77 లక్షల దరఖాస్తులు - ఈనెల 30 నుంచి హాల్‌టికెట్ల జారీ!

డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో ఉచితంగా కోచింగ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.