Summer Health Tips In Telugu : వేసవి కాలంలో మండుతున్న ఎండల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి కొందరికి చెమటకాయలు లేదా చెమట పొక్కులు వస్తుంటాయి. మరికొందరికి విరేచనాలు అవుతుంటాయి. మరి చెమట కాయలు ఏర్పడటానికి కారణాలేంటి? మరి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేసవి కాలంలో అధిక వేడిమికి గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై కామారెడ్డి వైద్య నిపుణుడు శ్రీనివాస్ సూచనలు మీ కోసం.
ఏమేం చేయాలంటే?
- ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల శరీరం నుంచి అధిక వేడి వెళ్లిపోతుంది.
- శరీరం నుంచి వేడిని తొలగించేందుకు గసగసాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి పొడిని చాలా తక్కువ మోతాదులో తీసుకుని నీటిలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతులను అలాగే తీసుకోవాలి లేదంటే వాటిని పొడిగా చేసి నీటిలో కలుపుకొని తాగినా సరిపోతుంది.
- ఒక గ్లాసు చల్లని పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకొని తాగినట్లయితే వేడి తగ్గుతుంది. గ్లాసు పాలలో కాస్త వెన్న కలుపుకొన్నా సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
- గంధాన్ని పేస్టులా చేసి దానిని నుదుటిపై రాసి కొద్ది సమయం ఉంచుకుంటే శరీరంలోని వేడి వెళ్లిపోతుంది.
చెమట పొక్కులు వస్తున్నాయా?
- వేసవికాలంలో వీపు, నుదురు భాగంలో ఈ చెమటకాయలు/చెమటపొక్కులు అధికంగా కనిపిస్తాయి. శరీరంలోని స్వేద గ్రంధుల(చెమట గ్రంధుల) నాళాలు సరిగా తయారు కాకపోవడంతో గ్రంధుల్లో తయారైన చెమట బయటకు రాకపోవడంతో ఇలా పొక్కుల మాదిరిగా కనిపిస్తాయి.
- పిల్లలకు, స్త్రీలకు ఎక్కువగా చెమట పొక్కులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బిగుతుగా ఉండే వస్త్రాలను ధరించడం వల్ల ఇలా జరుగుతుంది.
- ఆవిరి స్నానం చేయడం వల్ల స్వేద రంధ్రాలు తెరుచుకుని చెమట పొక్కులు తగ్గిపోతాయి.
- చెమట పొక్కులు ఉన్న వారు నిత్యం 3 సార్లు స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- వదులుగా ఉండే తెల్లటి వస్త్రాలను ధరిస్తే గాలి బాగా ఆడి చెమట పొక్కులు తగ్గిపోతాయి.
ఇంట్లో ఉంటే ఇవి - ఫంక్షన్స్‌కు వెళితే అవి - ఈ ఔట్ ఫిట్స్‌తో సమ్మర్లో కూల్‌గా ఉండండి
సమ్మర్ స్పెషల్ "తాటిముంజల పాయసం" - మండుటెండల్లో కూల్‌కూల్‌గా ఒక్కో గుటక వేస్తుంటే ఆ మజానే వేరు!