Summer Hair Care Tips : ఎండాకాలంలో ఎక్కువగా కేశ, చర్మ సంరక్షణను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా జుట్టు రూపురేఖలు మారిపోతున్నాయి. వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఉపయోగించే కూలర్లు, ఏసీలతో జుట్టు నిర్జీవంగా మారుతుంది. వేడి నేరుగా తలకు తగలడం ద్వారా చెమట అధికంగా పడుతుంది. చుండ్రు సమస్య అధికం అవుతుంది. వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకుంటే జుట్టును ఆరోగ్యంగా రక్షించుకోవచ్చని ఫిజీషియన్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.
టోపీతో లేదా స్కార్ప్‌తో కప్పేయాలి : ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జుట్టును టోపీతో లేదా స్కార్ప్‌తో కప్పేయాలి. తద్వారా ధూళి, దుమ్ము, యూవీ కిరణాల నుంచి కాపాడతాయి. ఎండ వేడితో కలిగే అనర్థాలను అధిగమించే అవకాశం ఉంది. తలలో తేమను నిలిపి ఉంచడానికి సహాయపడుతుంది. ఆరోగ్య రక్షణకు కేవలం చిట్కాలు పాటించడమే కాకుండా ఇతర జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
వారానికి 2 లేదా 3 సార్లు తల స్నానం : ఈ వేసవిలో ఎండ వేడిమి తట్టుకోలేక రోజూ తల స్నానం చేస్తుంటారు. దీంతో జుట్టులోని నూనె, తేమ తొలగిపోతాయి. ఎక్కువ సార్లు తల స్నానం చేయడంతో జుట్టు గడ్డిలా మారుపోతుంది. వారానికి 2 లేదా 3 సార్లు తల స్నానం చేస్తే సరిపోతుందని డాక్టర్ తెలిపారు.
ఆ దువ్వెనను ఎంచుకోవాలి : అధిక వేడి కారణంగా జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. వీటికి బదులుగా సహజమైన పద్ధతులను పాటించాలి. స్థిరమైన ఉష్ణోగ్రతల వద్ద బ్లో డ్రైయింగ్ వాడవచ్చు. తలకు దూరంగా పరికరం ఉంచితే మేలు. దూరం పళ్లు ఉన్న దువ్వెనను ఎంచుకొని ఉపయోగించాలి.
ఆరాక తల స్నానం : వేసవికాలంలో రాత్రి పూట గోరు వెచ్చని నూనెను జుట్టుకు పెట్టాలి. తద్వారా జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. చిట్లిపోయిన జుట్టును చికిత్స చేయడానికి దోహదపడుతుంది. కొబ్బరి, అవకాడో, ఆలివ్, బాదం తదితర నూనెను గోరు వెచ్చగా వేడి చేసి తలకు రాయాలి. గంట పాటు ఆరాక తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయని డాక్టర్ శ్రీనివాస్ సూచనలు చేశారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జుట్టుకు 'వేసవి' ముప్పు!- ఈ నేచురల్ ప్యాక్స్ ట్రై చేస్తే హెల్దీ కురులు సొంతమట!
పొడవాటి జుట్టు కావాలా? రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలట! ఈ టిప్స్ ఏంటో తెలుసా?