Young Yoga Teacher in Karimnagar : జీవితంలో యోగా భాగం కావాలన్నది నానుడి. కానీ ఆమె జీవితంలో యోగా నిత్యకృత్యమయ్యింది. దశాబ్ధ కాలంగా యోగా సాధన చేస్తున్న ఆమె. ప్రస్తుతం యోగాసానాలు వేసేందుకు చిన్నారులకు తర్ఫీదునిస్తోంది. సాధారణ డిగ్రీ చేస్తూనే యోగాలోనూ డిప్లమో కోర్సును చదువుతోంది. యోగా సాధన చేయటమేకాదు, నలుగురికీ ఈ విద్యను పంచుతూ జీవనోపాధి పొందుతోంది. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు సత్తా చాటిన లహరిక అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేస్తోంది.
జాతీయ స్థాయిలో : కరీంనగర్ కాపువాడకు చెందిన పయ్యావుల లహరిక యోగా మాస్టర్‌గా రాణిస్తోంది. ఆమె తల్లిదండ్రులు ఉమ గృహిణి కాగా తండ్రి ఆంజనేయులు రైస్ మిల్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. దశాబ్ధ కాలంగా యోగా సాధనను నిత్యకృత్యం చేసుకుంది. ప్రస్తుతం చిన్నారులకు శిక్షణనిస్తోంది. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా ఛాంపియన్ షిప్ 2019, 2023, 2024లలో బంగారు పతకాలు సాధించింది. 2020 జనవరి 5 న కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు 6 పతకాలతో పాటు. జాతీయ, రాష్ట్ర జిల్లా స్థాయిలో అనేక సార్లు ప్రశంసా పత్రాలను పొందింది.
వేసవి శిబిరంలో నేర్చుకుని : కరీంనగర్‌లో మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం లహరిక చదువుతోంది. చిన్నతనంలో ప్రతి ఏటా అంబేడ్కర్ స్టేడియంలో వేసవి శిబిరంలో నేర్చుకుంది. ఎక్కడైతే శిక్షణ పొందానో అక్కడే యోగా నేర్పించటంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. యోగా ద్వారా శరీరం మెుత్తం మీద ప్రభావం చూపుతుందని. తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించి యోగాలో శిక్షణ ఇవ్వాలన్నదే తన లక్ష్యమని లహరిక అంటోంది.
పాఠశాల స్థాయి నుంచే : లహరిక స్ఫూర్తితో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను యోగా సాధనలో చేర్పించారు. పాఠశాల సమయంలోనే యోగాపై శ్రద్ధ వహించటంతో. తమకు ఎంతో మేలు జరుగుతుందని చిన్నారులు తెలిపారు. పాఠశాల స్థాయిలోనే యోగా సాధన చేయటంతో. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొంది, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అవకాశం ఉంటుందని యోగా మాస్టర్లు అంటున్నారు.
'యోగాంధ్ర' గిన్నిస్ రికార్డు - ప్రధాని మోదీ సమక్షంలో ఘనత - డ్రోన్ విజువల్స్
యోగా ఏ టైంలో చేయాలి? - ప్రయోజనాలు ఏమిటి? - నిపుణులు ఏం చెబుతున్నారంటే!