State Government Relaunched NTR Baby Kit Scheme : చిన్నపిల్లల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దిశగా చర్యలు చేపడుతూ ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీకి శ్రీకారం చుట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని ప్రారంభించి అమలు చేసింది. అనంతరం 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోని వచ్చాక పథకం పేరు మార్చింది. అనంతరం 2021లో పథకానికి స్వస్తి పలికింది. ఇది చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని ఎన్డీయే ప్రభుత్వం భావించి పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది.
పీలేరు, కలికిరి, మదనపల్లె, వాల్మీకిపురం, రాయచోటి ప్రాంతీయాసుపత్రులతో పాటు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసూతి కేంద్రాలున్నాయి. వీటిల్లో ఏటా సుమారు 20 వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏడాదికి సుమారు రూ.2.82 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
గర్భిణీలకు 11 రకాల వస్తువులు - ఎన్టీఆర్ బేబీ కిట్లకు నిధులు విడుదల
బేబీ కిట్‌లో ఏం ఉంటాయంటే : బేబీ కిట్‌లో 11 రకాల వస్తువులుంటాయి. దోమతెర, బేబీ బెడ్, వాటర్ ఫ్రూప్ కాట్, బేబీడ్రస్, జేబురుమాళ్లు, పౌడరు, షాంపూ, ఆయిల్, సబ్బు తదితర వస్తువుంటాయి. ఒక్కో కిట్టు విలువ రూ.1,410 వరకు ఉంటుంది. పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.