State Civil Supplies Minister Nadendla Manohar Tweet : ధాన్యం కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. 'రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి' అంటూ కొనుగోళ్ల పట్టికను తన పోస్టింగ్‌కు జోడించారు. మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని ధ్వజమెత్తారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని పేర్కొన్నారు.
Good Morning @ysjagan గారూ.. వాస్తవాలు చెప్పే లెక్కలు ఓసారి కళ్ళారా చూడండి. మీ నిర్వాకం తెలుస్తుంది.
— Manohar Nadendla (@mnadendla) December 3, 2024
మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులు. బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు… pic.twitter.com/navSo0SefW
48 గంటలలోపే తాము డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. కనీసం గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారని మండిపడిన మనోహర్- రైతులను దగా చేసిన మీకు ర్యాలీలు చేసే అర్హత ఉందా? అని నిలదీశారు.
భయం లేకుండా బియ్యం దందా - వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమాలు!
రైతులకు అండగా ఉంటాం - 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు : మంత్రి నాదెండ్ల