Srisailam Mallikarjuna Swamy Temple In Kurnool District : వేసవి సెలవులు, సోమవారం కావడంలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయంలోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.
ఆలయ పరిసరాల్లో భక్తులతో రద్దీ నెలకొంది. స్వామి వారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న వారికి అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. చిన్నారుల కోసం పాలు, బిస్కెట్లును ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఉగాది బ్రహ్మోత్సవాలు - కిటకిటలాడుతున్న శ్రీశైలం
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం - సర్వదర్శనానికి 5 గంటల సమయం