ETV Bharat / state

పులులకు కరెంట్ షాక్ - ఇప్పటివరకు ఎన్ని మరణించాయో తెలుసా? - TIGERS KILLED IN TELANGANA

పులులకు కరెంటు షాక్​ ఇచ్చి మరీ చంపేస్తున్న వేటగాళ్లు - చనిపోయిన తర్వాత గోళ్లు, చర్మం విక్రయించి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు - ఇప్పటివరకు రాష్ట్రంలో వేటగాళ్ల ఉచ్చులకు బలైన పులుల వివరాలు ఇవే

Special Story on Tiger Killings
Special Story on Tiger Killings (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2025 at 5:48 PM IST

2 Min Read

Special Story on Tiger Killings : అటవీ ప్రాంతంలో కే8 పులిని చంపి పది రోజులైనా కాలేదు. ఇప్పుడు మరో పులిని వేటగాళ్లు విద్యుత్​ ఉచ్చులను ఏర్పాటు చేసి హతమార్చారు. దీని అంతటికీ గ్రామాల్లో విద్యుత్​ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన లైన్లకు కొండీలు వేసి మరీ అంతమొందిస్తున్నారు. పులులు చనిపోయిన తర్వాత వాటి గోళ్లు, చర్మాన్ని వేరు చేసి విక్రయిస్తూ సొమ్మును సంపాదిస్తున్నారు. ముఖ్యంగా స్మగ్లర్లు మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్​, ఛత్తీస్​గఢ్​లోని ఇంద్రావతి పులుల అభయారణ్యాల నుంచి తెలంగాణకు వస్తున్న పులులను లక్ష్యంగా చేసుకుంటూ వారి చీకటి దందాను సాగిస్తున్నారు.

Special Story on Tiger Killings
కుమురం భీం జిల్లా పెంచికల్‌పేట అడవుల్లో ఈ నెల 15న వేటగాళ్ల ఉచ్చుకు బలైన కే8 పులి (ETV Bharat)

వేటగాళ్ల విద్యుత్​ ఉచ్చులకు బలైపోయిన పులుల వివరాలు ఇవే :

  • ఈనెల 15న కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికల్​పేట మండలంలోని పాతచిచ్చాల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల విద్యుత్​ తీగను అమర్చి కే8 పులిని చంపేశారు. అనంతరం దాని గోళ్లు, చర్మాన్ని తీసుకెళ్లగా నాలుగు రోజుల అనంతరం పెంచికల్​పేట, దహెగాం మండలాల్లోని 38 మంది అనుమానితులను అధికారులు పట్టుకొని గోళ్లు, చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అడవుల్లో వేటగాళ్లు ఉచ్చు బిగించి 2021 అక్టోబరులో పులిని చంపేశారు. తర్వాత దాన్ని గోళ్లు, చర్మాన్ని అక్రమ రవాణా చేస్తుండగా అటవీ అధికారులకు పట్టుబడ్డారు.
  • మంచిర్యాల జిల్లా శివ్వారం అటవీ ప్రాంతంలో 2019 జనవరిలో స్మగ్లర్లు విద్యుత్తు తీగను అమర్చి పులిని హతమార్చారు. దాని చర్మం, గోళ్లు విక్రయించే సమయంలో అధికారులు దుండగులను పట్టుకున్నారు.
  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా బెజ్జూరు మండలం ఏటిగూడ, కోటపల్లి మండలం పిన్నారం, ఖానాపూర్​ మండలం పెంబి, చెన్నూరు మండలం పంగిడి సోమారం ప్రాంతాల్లోనూ 2016లో వేటగాళ్లు కరెంటు ఉచ్చులను బిగించి పులులను అంతమొందించారు.
  • చెన్నూరు అటవీ ప్రాంతంలో 2014లో, ఊట్పల్లి చెరువు వద్ద 2011లో, కాగజ్​నగర్​ మండలం పాపన్​పేట్లో 2006లో కరెంటు షాక్​తో పులులను చంపేశారు.

విద్యుత్​ తీగలకు కవర్డ్​ కండక్టర్స్​ ఏర్పాటు చేయాలి : విద్యుత్​ తీగలకు కవర్డ్​ కండక్టర్స్​ను(ఇన్సులేటెడ్​ కోటింగ్​) ఏర్పాటు చేస్తే కొండీలు వేసే అవకాశం ఉండదని ఆసిఫాబాద్​ డీఎఫ్​ఓ నీరజ్​కుమార్​ తెలిపారు. అడవి జంతువులను స్మగ్లర్ల బారి నుంచి రక్షించొచ్చని అభిప్రాయపడ్డారు. అడవుల్లో తీగలకు కవర్డ్​ కండక్టర్స్​ ఏర్పాటు చేయాలని పలుమార్లు విద్యుత్తుశాఖ అధికారులను కోరామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మరోవైపు ఆసిఫాబాద్​ ఎస్​ఈ శేషారావు పేర్కొన్నారు.

కరెంట్​ షాక్​ ఇచ్చి - కే-8 ఆడపులిని చంపేసిన స్మగ్లర్లు

పొలంలో ఓనర్​పై పులి ఎటాక్- కాపాడిన పెంపుడు కుక్క- కానీ పోరాడిన కాసేపటికే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.