ETV Bharat / state

కరివేపాకే అని తీసేస్తున్నారా ? అయితే మీరు చాలా మిస్​ అవుతున్నట్లే ! - Health Benefits of Curry Leaves

Curry Leaves Health Benefits : తాలింపులో రెండు కరివేపాకు రెమ్మల్ని దూసి వేశామంటే చిటపటమంటూనే ఘుమఘుమలతో వంటకం రుచి అదిరిపోవాల్సిందే. కానీ తినేటప్పుడు మాత్రం ఆ ఆకుల్ని తీసి పక్కనపెట్టేస్తారు. అది చేసే మేలేంటో తెలుసుకున్నారంటే కరివేపాకే కదా అని తీసి పారేయకుండా కాస్త ఆలోచనలో పడతారు. దీని గొప్పతనం తెలిసిన సౌందర్య నిపుణులు సైతం ఇప్పుడు కరివేపాకు నూనెల దగ్గర్నుంచి షాంపూల వరకూ ఎన్నో ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 9:21 PM IST

Updated : Sep 18, 2024, 10:27 PM IST

Health Benefits By using Curry Leaves in Daily Life
Curry Leaves Health Benefits (ETV Bharat)

Health Benefits By using Curry Leaves in Daily Life : మహిళల దృష్టిలో కరివేపాకు వంటల్లో వేసే ఆకు కాదు, అదో ఎమోషన్‌. వంట చేయడానికి అన్ని పదార్థాలు ఉన్నా తాలింపు వేయడానికి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు. అందుకే అప్పట్లో పెరట్లో సువాసన వెదజల్లే కరివేపాకును పెంచుకుంటే, ప్రస్తుతం పరిస్థితి అనుగుణంగా బాల్కనీ కుండీల్లోనూ మొక్కల్ని పెంచుతున్నారు. వాసనతో పాటు వంటల్లో రుచి పెంచే ఈ కరివేపాకు ఔషధ గుణాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే సరికొత్త ఉత్పత్తులతో కరివేపాకు అందర్నీ ఆకట్టుకుంటోంది.

కరివేపాకు, వేపాకును పోలి ఉంటుంది. దీనిని స్వీట్​ లీవ్స్​ అని అంటారు. ఈ ఆకులో ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, జింక్‌, పీచు పోషకాలతో పాటు విటమిన్‌-బి, విటమిన్‌ సీ, విటమిన్‌-ఇలు ఉంటాయి. రోజూ మనం తినే ఆహారంలో కరివేపాకు ఉండేలా చూసుకుంటే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Curry Leaves Health Benefits
కరివేపాకుతో తయారు చేసిన ప్రొడక్ట్స్ (ETV Bharat)
  • బరువు తగ్గాలనుకునేవారు కూడా ఉదయం కరివేపాకును తింటే ఎంతో మంచిదట. దీనిలో ‘కార్బజోల్‌ ఆల్కలాయిడ్స్‌’ బరువు నియంత్రణలో ఎంతగానో సాయపడతాయి. శరీరంలోలి వ్యర్థాల్నీ సైతం బయటకు పంపిస్తూ, జీర్ణశక్తిని పెంచడంలోనూ కరివేపాకు ఉపయోగపడుతుంది.
  • షుగర్​ లెవల్స్​ను నియంత్రించే శక్తి కరివేపాకులో ఉంటుంది. అందుకే మధుమేహులకు ఇది సరైన ఆహారమని అంటారు.
  • కరివేపాకులో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కంటి చూపును సైతం మెరుగుపరచడమే కాకుండా కంటి సమస్యల్ని ముందుగానే నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికి కరివేపాకు ఉపయోగమే. కొలెస్ట్రాల్‌ని నియంత్రించే గుణాలూ కరివేపాకు ఉన్నాయి.
  • వ్యాధినిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి సైతం ఈ కరివేపాకు కాపాడుతుంది. క్యాన్సర్లనీ, నాడీ సంబంధిత వ్యాధుల్నీ అడ్డుకుంటుందట.
  • కరివేపాకు వాసన పీల్చితే మనలోని మానసిక ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయట. జ్ఞాపకశక్తిని పెంచే సైతం పెంచే కరివేపాకు అల్జీమర్స్‌ లాంటి వ్యాధుల్నీ దగ్గరకు రానివ్వదట. మహిళల్లో రుతుక్రమ సమస్యల్నీ అదుపు చేస్తుంది. ఒళ్లు నొప్పుల్నీ, గర్భిణుల్లో వాంతులూ, వికారాల్నీ తగ్గిస్తుందట.
  • కరివేపాకు కేవలం ఆరోగ్యానికి కాకుండా చర్మానికి, జుట్టును ఆరోగ్యంగా అందంగా ఉంచేలా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ఉన్న విటమిన్​- ఎ, విటమిన్​- బి, ప్రొటీన్లు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తూ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుందట. జుట్టు నిగారింపునూ పెంచుతాయి. అంతేకాకుండా ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గించే లక్షణాలు ఎక్కువే ఉంటాయి. అందుకే చుండ్రు సమస్యలకూ కరివేపాకును ఎక్కువగా వాడుతున్నారు.

కరివేపాకుతో సౌందర్య ఉత్పత్తులు : ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే కరివేపాకుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే ఇంట్లోని చేసుకునే వంటలతోపాటు మార్కెట్లోనూ కరివేపాకుతో తయారు చేసిన పొడులూ, బిళ్లలూ, జ్యూసులూ, బిస్కెట్లూ, చాక్లెట్లూ, కర్రీలీవ్స్‌ టీ లాంటివెన్నో లభిస్తున్నాయి. సౌందర్య ఉత్పత్తుల్లోనూ షాంపూలూ, కండిషనర్లూ, నూనెలూ, హెయిర్‌ మాస్క్‌లూ వస్తున్నాయి. ఇంత తెలిశాక, ఇన్ని అందుబాటులో ఉన్నా కూడా కరివేపాకేగా అని తీసిపారేస్తారా మరి.

Curry Leaves Health Benefits
కరివేపాకులో ఉండే పోషకాలు (ETV Bharat)

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్​ నుంచి షుగర్ సమస్య దాకా - ఆ సమయంలో కరివేపాకు తింటే అన్నీ సెట్! - Benefits Of Curry Leaves

Last Updated : Sep 18, 2024, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.