Special Cell to Monitor Leopards in Tirumala : శేషాచలం పరిధిలో చిరుత పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తిరుమల కాలినడక మార్గాల్లో భక్తులపై తరచూ చిరుతలు దాడి చేస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమవుతోంది. వన్యప్రాణుల స్వేచ్ఛాయుత సంచార వాతావరణాన్ని దెబ్బ తీయకుండానే యాత్రికులు సురక్షితంగా కొండపైకి చేరుకునేందుకు గల అవకాశాలపై దృష్టి సారించింది. ఏడో మైలు వద్ద చిరుతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటుకు నడుం బిగించింది. శాటిలైట్, జీపీఎస్, అధునాతన కెమెరాల వంటి వ్యవస్థలతో వాటి పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ మ్యూజియం ఉన్న భవనంలోనే ఈ సెల్ ఏర్పాటు కానుంది.
అన్ని రకాల సాంకేతికతతో కట్టడి : అలిపిరి మార్గంలో చిరుతల పర్యవేక్షణకు సాంకేతిక సహకారం తీసుకుంటామని, చిరుత పులుల నుంచి భక్తులకు ఎలాంటి ముప్పు కలగకుండా పర్యవేక్షణ సెల్ ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సెల్వం తెలిపారు.
చిరుత దొరికిందోచ్ - తిరుపతిలో ఎట్టకేలకు బోనులో చిక్కింది
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం - సీసీ కెమెరాలో దృశ్యాలు