Ayyannapatrudu Unveils World Telugu Conference Logo: మాతృభాషకు పెద్దపీట వేయడం ప్రభుత్వం, ప్రజల బాధ్యత అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మాతృభాషలో మాట్లాడటం ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాలని విద్యా బోధనలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు భాష, సంస్కృతి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు -2026 లోగోను విశాఖలోని గోల్ఫ్ క్లబ్‌లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తెలుగు సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తూ మాతృభాషను మరింత ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. డా.గజల్ శ్రీనివాస్, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో అమరావతి రాజధాని ప్రాంతంలోని గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీ గ్రౌండ్స్‌లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనుండటం ఎంతో అభినందనీయమవు అన్నారు.
సుపరిపాలన కోసం ప్రత్యేక సలహామండలి - వాట్సప్ గవర్నెన్స్‌లోకి అన్ని సేవలు
అతి పెద్ద తెలుగు పండుగగా ఈ మహాసభలు: తెలుగు భాషాభిమాని అయిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ఈ లోగో ఆవిష్కరణ జరగడమంటే ప్రతి తెలుగుబిడ్డ దీన్ని ఆవిష్కరించినట్లేనని డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆంధ్ర మేవ జయతే అన్న నినాదంతో ఏపీలోని అతి పెద్ద తెలుగు పండుగగా ఈ మహాసభలు జరుగుతాయని, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర ప్రముఖులు, దేశాధినేతలు, న్యాయమూర్తులు, సినిమా, సాహితీ, సాంస్కృతిక రంగాలకు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.
సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రాధాన్యం: యువతకు, విద్యార్థినీ విద్యార్థులకు ఈ మహాసభల్లో వారి సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శి రెడ్డప్ప ధవేజీ, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మహాసభల ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, రెడ్‌క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు, కళాభారతి అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్‌రాజు, కోడూరి సుశీల తదితరులు పాల్గొన్నారు.
అడవి తల్లిని నమ్ముకుంటే బువ్వ పెడుతుంది, నీడనిస్తుంది: పవన్‌కల్యాణ్
వాహనం దిగి వాగులో నడిచి - గిరిజనుల కష్టాలు తెలుసుకున్న పవన్‌కల్యాణ్