ETV Bharat / state

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్​లో కొత్త ఎంట్రీ, ఎగ్జిట్​లు - తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులకు విజ్ఞప్తి - భవనం కూల్చివేత, కొత్త నిర్మాణం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు

SECUNDERABAD RAILWAY STATION WORKS
Secunderabad Railway Station Redevelopment (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 19, 2025 at 8:42 AM IST

2 Min Read
Choose ETV Bharat

Secunderabad Railway Station Redevelopment : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్​లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మంగళవారం పలు సూచనలు జారీ చేసింది. ఉత్తరం వైపు ఉన్న స్టేషన్‌ భవనం కూల్చివేత, కొత్త నిర్మాణం నేపథ్యంలో ప్రవేశ, నిర్గమన మార్గాలు, ప్రయాణికులకు అందించే సదుపాయాల గురించి ఇందులో వివరించింది.

  • ఫ్లాట్‌ఫామ్‌ నంబర్‌-1లోని గేట్‌ నంబర్‌-2 (గణేష్‌ ఆలయం పక్కన) కొత్త ప్రవేశమార్గం తెరిచారు.
  • నాలుగో నంబర్‌ ప్రవేశమార్గాన్ని మూసివేసి, గేట్‌ నంబర్‌ 3, 3బీ (స్వాతి హోటల్‌ ఎదురుగా), పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు గేట్‌ నంబర్‌ 8 (బోయిగూడ మార్గంలో) ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. ఇక్కడే మరో జనరల్‌ బుకింగ్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు.
  • కుంభమేళా స్పెషల్‌ ట్రైన్ల రాకపోకలతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 24 గంటల పాటు కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించనున్నారు.
  • రైలు వచ్చే ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ను ముందుగానే ప్రకటించనున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ : హైదరాబాద్​ పరిధిలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇందుకోసం ఏకంగా రూ.514.49 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే చర్లపల్లి స్టేషన్​ పనులు పూర్తికాగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ పనులు వేగవంతగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రూ.720 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తోంది. అమృత్‌భారత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

సికింద్రాబాద్ భవన నమూనా : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తుకు వచ్చే భవన నమూనా. రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా అధికారులు ఇప్పుడు దీన్ని కూల్చివేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకంలో ఈ స్టేషన్​ను చేర్చింది. ఆధునికీకరణ కోసం పనులు జరుగుతున్న నేపథ్యంలో పురాతన కట్టడాలను అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించనున్నారు.

సికింద్రాబాద్​లో ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇక కనబడదు - ఇప్పుడే వెళ్లి చూసేయండి

ఎయిర్​పోర్ట్​ల తరహాలో రైల్వేస్టేషన్లు - సికింద్రాబాద్ సహా ఈ స్టేషన్లకు మహర్దశ