Special Trains from Cherlapalli to Tirupati: చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వారంలో రెండు రోజుల చొప్పున అదనంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వీసులు మే 31వ తేదీ వరకు నడవనున్నాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి చర్లపల్లికి శనివారం, సోమవారం ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
"ఈ వేసవి చల్లచల్లగా గడిచేలా IRCTC టూర్ ప్లాన్" - విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు
రైల్వే శాఖ కీలక నిర్ణయం - ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు!