Son Steals Rs.2 Lakh from Father's Shop : ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పుతాడు. ఏది మంచో, ఏది చెడో ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాటల కన్నా, గురువు చెప్పే మాటలనే విద్యార్థి ఎక్కువగా తలకెక్కించుకుంటాడు. అలాంటిది గురువే దొంగైతే, అతని వద్ద చేరిన విద్యార్థికి కూడా అవే బుద్ధులు నేర్పించి సమాజానికి చేటు చేస్తాడు. ఇలాంటి ఘటనే తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తండ్రి దుకాణంలోనే సొంత కుమారుడితో డబ్బులు చోరీ చేయించాడో ట్యూషన్ టీచర్. ఆ డబ్బులతో ఐఫోన్ కొనిచ్చి అడ్డంగా దొరికిపోయాడు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం,
షాపూర్‌నగర్ హెచ్ఎంటీ సొసైటీలో నివసించే కమల్‌జైన్ స్థానికంగా చక్కెర వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఏడో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. కుమారుడు చదువులో మరింత రాణించాలనే ఉద్దేశంతో ఇంటి ఎదురుగా ఉండే సందీప్ గేలోత్ వద్దకు ప్రతిరోజూ ట్యూషన్‌కు పంపించేవాడు. ఇలా నిత్యం ట్యూషన్‌కు వెళ్లి చదువుకునేవాడు. దీంతో కొన్ని నెలలుగా విద్యార్థి, ట్యూషన్ మాస్టర్‌కు మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది.
దొంగలించిన డబ్బుతో కుమారుడికి ఐఫోన్ : ఈ క్రమంలోనే విద్యార్థి తండ్రి చేసే వ్యాపారం గురించి ట్యూషన్ టీచర్‌కు అవగాహన ఉండటంతో, దుకాణంలో నుంచి డబ్బులు తీసుకురావాలని విద్యార్థికి చెప్పాడు. ఇలా పలు దఫాలుగా సుమారు రూ.2 లక్షల వరకు విద్యార్థి అతనికి సొమ్మును అందజేశాడు. అందులోంచి బాలుడికి ఓ ఐఫోన్ కొనిచ్చాడు. కుమారుడి చేతిలో ఐఫోన్ కనిపించడంతో ఆ ఫోన్ ఎక్కడిదని తండ్రి ఆరా తీశాడు. దీంతో ట్యూషన్ టీచర్ ఇప్పించారని కుమారుడు చెప్పాడు. ఆ ఐఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎక్కడివని గట్టిగా నిలదీయడంతో దుకాణంలో నుంచి తీసినట్లు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన తండ్రి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
వీడెవడండీ బాబూ! క్రికెట్‌లో సెంచరీ చేసేంత ఈజీగా 100 సెల్‌ఫోన్లు దోచేశాడు
దమ్ముంటే పట్టుకోండి చూద్దాం - 'దొంగ తెలివి'తో పోలీసులకే సవాల్