ETV Bharat / state

అనాథ యువతికి గ్రాండ్​గా పెళ్లి - ఎక్కడంటే? - UNIQUE WEDDING IN TENALI

అనాథ యువతికి అన్నీతానై పెళ్లి చేసిన నిర్వాహకులు - తెనాలి స్వధార్ హోమ్​లో సంఘటన

Unique Wedding in Tenali
Unique Wedding in Tenali (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 12, 2025 at 9:36 PM IST

1 Min Read

Unique Wedding in Tenali : వారికి తనే మన అంటూ ఎవ్వరూ లేరు. లోకం చూసిన దగ్గర నుంచి అనాథలుగానే జీవితాన్ని ప్రారంభించారు. అలాంటి వారు జేఎమ్​​జే స్వధార్​ హూమ్​లో ఆశ్రయం పొందుతున్నారు. అలా వారిలో కొందరూ సొంతకాళ్లపై నిలబడ్డారు. అంతేకాకుండా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారవుతున్నారు. తాజాగా ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలోని స్వధార్ హోమ్​లో ఉంటున్న ఎం.సుద్రి అనే యువతి మూడుముళ్ల బంధంతో ఓ కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఈ వివాహ వేడుక సిస్టర్ హృదయ మేరీ నేతృత్వంలో ఘనంగా జరిగింది.

అనాథ యువతికి అన్నీతానై పెళ్లి చేసిన నిర్వాహకులు (ETV Bharat)

పెళ్లికి సంబంధించిన వస్తువులు కూర్పు: అనాథ యువతి ఎం.సుద్రికి వినుకొండ మండల గ్రామం జంగాల గ్రామానికి చెందిన తేజసాయితో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకను అంగలకుదురు గ్రామానికి చెందిన గణేష్ యూత్ అధ్యక్షుడు వీరవల్లి మురళి, ఉపసర్పంచ్ కనగాల నాగభూషణం మిత్ర బృందం దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించిన మంగళసూత్రం, పట్టుచీరలు , తదితర వస్తువులను వారు సమకూర్చారు. స్వధార్ హోమ్ చేస్తున్న కార్యక్రమాలు అభినందించదగ్గ విషమని మురళి పేర్కొన్నారు.

హోమ్​లో మొత్తం 46 మంది అనాథలు: కాగా స్వధార్ హోమ్​లో మొత్తం 46 మంది అనాథ పిల్లలు ఉన్నారు వారు ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు కంప్యూటర్ కుట్టుమిషన్ ఎంబ్రాయిడరీ వంటి పలు వాటిలో శిక్షణ తీసుకుంటున్నారు. వారు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని సాధించే దిశగా కృషి చేస్తున్న ఈ కార్యక్రమంలో తేజసాయి తల్లిదండ్రులు అభిషేక్ , శేషరత్నం, గణేష్ యూత్​కు చెందిన ఖాదర్, సలాం ,నిజాం, ముప్పవరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

వాట్సప్​లో వెడ్డింగ్ కార్డ్ వైరల్ - ఆగిన పెళ్లి

"వివాహాల విశ్వావసు" నామ సంవత్సరం - ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో శుభముహూర్తాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.