ETV Bharat / state

అడుగడుగునా ఉదాసీనత! - అమాత్యులు మీకిది తగునా? - AP MINISTERS INDIFFERENCE

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు - ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉన్నతాధికారుల తీరు నిర్ణయాల అమలులో మీనమేషాలు

AP Ministers indifference
AP Ministers indifference (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 23, 2025 at 7:29 AM IST

Updated : June 23, 2025 at 7:53 AM IST

5 Min Read

Apathetic Authorities in AP : ప్రయాణం సాఫీగా సాగాలంటే డ్రైవర్‌ సమర్థత, అనుభవం ఎంత ముఖ్యమో బండి కండిషన్‌ కూడా అంతే ముఖ్యం. పాలనా వ్యవహారాల్లో తలపండిన ప్రభుత్వాధినేత అయినా ఆయన ఆలోచనలు ఆచరణలోకి రావాలంటే సరైన అధికార యంత్రాంగం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. రౌతు మెత్తనైతే గుర్రం మూడుకాళ్ల మీద నడిచిందన్న సామెతలా ఏపీలో పరిపాలనా తీరు ఉంది. కొందరు అధికారులతో పాటు మంత్రుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు (ETV)

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వినడానికి కటువుగా ఉంటాయి. కానీ ఎవరిపైనైనా చర్య తీసుకోవాలంటే ఆయనకు మనసొప్పదు. మళ్లీ 1995 నాటి సీఎంని చూస్తారని, సరిగ్గా పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని ఏడాదిగా హెచ్చరిస్తున్నారే తప్ప ఇంతవరకూ ఒక్కరినీ గట్టిగా మందలించిన దాఖలాల్లేవు. దీంతో ఏపీ సచివాలయం నుంచి గ్రామ సచివాలయాల వరకు అధికార యంత్రాంగంలో ఉదాసీనత కనిపిస్తోంది.

రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు ఆలోచనల్ని , వేగాన్ని అందిపుచ్చుకుని పరుగులు తీసే యంత్రాంగం కొరవడింది. దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మినహాయింపు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగంలో కాలక్షేపం ధోరణి పెరిగింది. అదే సమయంలో అధికారులు వారి సొంత పనులకు మాత్రం ఎక్కడా లోటు రానివ్వడం లేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

AP Officials Indifference : ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంసకర పాలనలో కుదేలైన వ్యవస్థల్ని గాడిన పెట్టేందుకు, ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు, ఎవరికీ ఏ లోటూ లేకుండా సంక్షేమ రథాన్ని పరుగులు తీయించేందుకు కష్టపడుతున్నారు. ఆయన తపన, రాష్ట్రాభివృద్ధి, ప్రజాక్షేమంపై చొరవ చాలా మంది మంత్రులు, మెజార్టీ అధికారుల్లోనూ కనిపించడం లేదు. దీంతో ఏడాదిగా ప్రభుత్వ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు.

కేంద్ర సర్వీసులు, ఇతర రాష్ట్ర సర్వీసుల నుంచి కొందరు అఖిలభారత సర్వీసుల అధికారుల్ని ఏపీకి డిప్యూటేషన్‌పై పంపాలని సీఎం స్వయంగా కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశారు. సుమారు 10 నెలలుగా ఈ వ్యవహారం నానుతోంది. ఆ జాబితాలోని ఒక ఐఆర్ఎస్ అధికారిణి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వస్తే ఆమెకు కేటాయించిన శాఖలో చేర్చుకోకుండా ఇద్దరు ఉన్నతాధికారులు ఆమెకు చుక్కలు చూపించారు. ఆమెను వేధించి విసిగి వేసారేలా చేశారు. ఎందుకిలా చేశారని వాళ్లను ప్రశ్నించే వారు లేకుండా పోయారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేపట్టింది. మెజార్టీ మంత్రులు, అధికారులు ఓనర్‌షిప్‌ తీసుకుని వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్ల తగినంత మైలేజీ రాలేదు సరికదా అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తిరిగి సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయి. యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి, ఉదాసీనత, నిర్లిప్తత, లెక్కలేనితనం వదిలించకపోతే దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

AP Government Apathy : అధికారుల తీరే ఇలా ఉందనుకుంటే మెజార్టీ అమాత్యులు అందుకు తగ్గట్టే వ్యవహరిస్తున్నారు. తొలిసారి మంత్రులైవారిలోనూ ఉదాసీన వైఖరి కనిపిస్తోంది. నెలలో పట్టుపని 10 రోజులు సచివాలయంలో ఉండి వారి శాఖలపై క్షుణ్నంగా సమీక్షించేవారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇంఛార్జ్ మంత్రులు వారికిచ్చిన జిల్లాల్లో తరచూ పర్యటించాలని, సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సీఎం ప్రతి సమావేశంలోను చెబుతున్నారు. అన్ని శాఖలపై సమీక్షించిన అమాత్యులు ఎంత మంది జిల్లా సమస్యల పరిష్కారానికి వారి దగ్గరున్న ప్రణాళిక ఏంటనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు మంత్రులెవరూ చొరవ తీసుకోవడం లేదు. అది మన పని కాదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కీలకమైన రెవెన్యూ శాఖలో ఎన్నో సమస్యలున్నాయి. రీ సర్వేలో సమస్యలు పరిష్కరిస్తామని సర్కార్ చెప్పినా ఎక్కడా అవి పరిష్కారం కాలేదు. తన శాఖపై ఓనర్‌షిప్‌ తీసుకుని సమస్యలు పరిష్కరించాల్సిన రెవెన్యూ మంత్రికి ఇతర వ్యాపకాలే ఎక్కువన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

కొన్ని శాఖల్లో మంత్రులకు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. అధికారుల హడావుడి నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి తల బొప్పి కడుతోంది. తుని రైలు దహనం కేసుని కొట్టేస్తూ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేయాలన్న నిర్ణయమే దానికి ఉదాహరణ. హోం శాఖ జారీ చేసిన ఆ ఉత్వర్వులు ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టాయి. నష్ట నివారణకు దిగాల్సి వచ్చింది.

వెలువడని ఉత్తర్వులు : కూటమి అధికారంలోకి వచ్చాక స్థిరాస్తి రంగానికి అనేక వెసులుబాట్లు కల్పించింది. నాలా రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు 2 నెలల క్రితం ప్రకటించారు. ఇది స్థిరాస్తి రంగానికి అతి పెద్ద ఊరట. అయినా ఇంత వరకు ఉత్తర్వులు వెలువడలేదు. ఇది అమల్లోకి వస్తే రియల్ ఎస్టేట్ సెక్టార్ ఊపందుకునేందుకుని ప్రభుత్వానికి ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుంది. విశాఖ జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరిస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. కానీ అదీ ఓ కొలిక్కి రాలేదు.

ప్రతిసారి వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పడిపోయి రైతులు పంటలు తెగనమ్ముకున్నాక ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది. అన్నదాతలకు సూక్ష్మపోషకాలు ఇవ్వడానికి రూ.30 కోట్లు ఖర్చవుతుంది. సర్కార్ నిర్ణయం తీసుకుని రెండు నెలలైనా ఇప్పటి వరకు అమలు చేయలేదు. కర్షకులకు వ్యక్తిగత వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసింది. కూటమి వచ్చాక దాన్ని పునరుద్ధరించినా తీసుకుంటున్న రైతుకి సంతృప్తి లేదు.

గత ప్రభుత్వ హయాంలో సహకార పరపతి సంఘాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినా కమిషనర్‌ హోదాలో విచారణ జరిపించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సదరు అధికారి పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్యకు చెందిన విలువైన ఆస్తుల్ని అమూల్‌కి కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. గ్రామీణ పాలసేకరణ కేంద్రాల పేరుతో కోట్లతో పరికరాలు కొని చాలా వరకు మూలన పడేశారు. పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ రిడ్రెసల్‌ సిస్టమ్​లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించే కార్యక్రమం ఒక ప్రహసనంగా మారింది.

వివాదస్పదంగా నిర్ణయాలు : జలజీవన్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వానికి సవరించిన డీపీఆర్‌లు పంపించాలని సీఎం ఆదేశించినా సంబంధితశాఖ అధికారులు జాప్యం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని గట్టిగా మందలిస్తే తప్ప డీపీఆర్‌లు పంపలేదు. కేంద్రం వెంటపడి నరేగా నిధులు తెచ్చుకోవడంలోనూ వైఫల్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా గుత్తేదారులు ఏళ్ల తరబడి బిల్లుల కోసం నిరీక్షిస్తుండగా రుషికొండ ప్యాలెస్‌ పనులు చేసిన గుత్తేదారుకి సర్కార్ బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది.

ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి రాష్ట్ర సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకూ తీవ్రంగా ఉంది. కొంతమంది కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు అవినీతికి గేట్లు తెరిచేశారన్న ఆరోపణలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక కలెక్టర్‌ నేరుగా తన కార్యాలయంలోనే ముడుపులు తీసుకుంటారన్న ఆరోపణలున్నాయి. అవినీతిని నియంత్రించడంలో సర్కార్ నుంచి గట్టి చర్యల్లేవు. 2014-2019 మధ్య ఆదాయానికి మించి వందల కోట్ల ఆస్తులు కూడగట్టిన అధికారులపై వరుస దాడులతో వెన్నులో వణుకు పుటించిన ఏసీబీ ఇప్పుడు నిద్రాణంగా మారిపోయింది. జిల్లాల్లో ఇప్పటికీ చాలా కీలకమైన పోస్టులో గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీతో అంటకాగినవారే కొనసాగుతున్నారు. వారితో పాటు, జిల్లా కలెక్టర్లలో చాలా మందిని బదిలీ చేయాల్సి ఉన్నా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలున్నాయి.

ప్రజాప్రతినిధుల ఇసుక దందా - ఆ ఐదు జిల్లాల వారే 17 మంది

అక్రమార్కులపై కేసులు సరే- విచారణ, శిక్షలెప్పుడు?

Last Updated : June 23, 2025 at 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.