ETV Bharat / state

పరీక్ష కేంద్రంలోకి పాము - అధికారికి కాటు - SNAKE BITE TO SSC EXAM CENTRE

వేద స్కూలుకు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌గా వెళ్లిన కరీముల్లా - పరీక్ష కేంద్రంలోనే కాటేసిన పాము

snake_bite_to_ssc_exam_chief_superintendent_at_palnad
snake_bite_to_ssc_exam_chief_superintendent_at_palnad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 28, 2025 at 1:43 PM IST

1 Min Read

Snake Bite To SSC Exam Chief Superintendent at Palnadu District : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేద ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఈ రోజు (శుక్రవారం) చీఫ్ సూపరిటెండెంట్‌ ఘంటసాల కరిముల్లా పాము కాటుకు గురయ్యాడు. ఉపాద్యాయులు తెలిపిన వివరాల ప్రకారం పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో చుట్టుపక్కల పొలాల నుంచి మూడో నెంబర్ గది వద్దకు పాము వచ్చింది.

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కరిముల్లా పామును తన కాళ్లతో తొక్కి స్కేలుతో పక్కకు వేస్తున్న క్రమంలో చేతిపై పడి కాటు వేసింది. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు కరిముల్లాను హుటాహుటిన చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాము విషపూరితమైంది కాకపోవడంతో కరిముల్లా పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

'పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో మూడో నెంబర్ గది వద్దకు పాము వచ్చింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పామును బయటికి పంపించేద్దామనుకున్నాను. ఈ క్రమంలో కాళ్లకు ఉన్న షూతో పామును తొక్కి స్కేల్​తో పక్కకు పడెయ్యాలనుకున్నాను. కానీ ఒక్కసారిగా పాము చేతిపై పడి కాటు వేసింది.' -కరిముల్లా, చీఫ్ సూపరిటెండెంట్‌, ఘంటసాల

పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్- 11 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్

పదో తరగతి పరీక్ష కేంద్రంలో సిమెంట్​ బస్తాలు - విద్యార్థులకు ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.