ETV Bharat / state

వైకల్యం భారమైనా సంకల్పంతో ముందడుగు - క్రికెట్​లో రాణిస్తున్న శివకోటి - YUVA STORY ON SHIVAKOTI

టీ-20 సీరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు - చిన్నతనంలోనే యువకుడి కుడి చేతికి పోలియో, ఎడమచేతితోనే బ్యాటింగ్‌, బౌలర్‌గా రాణిస్తున్న శివకోటి

Versatile Player Excels In Cricket At Annamayya District
Versatile Player Excels In Cricket At Annamayya District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 21, 2025 at 1:11 PM IST

3 Min Read

Versatile Player Shivakoti Excels In Cricket At Annamayya District: ఆ యువకుడు పుట్టుకతోనే అంగవైకల్యం వెంటాడింది. ఐతేనేం. పట్టుదల, కృషి, ఉంటే విజయానికి ఇవేవీ అడ్డుకావని నిరూపించాడు. వైకల్యాన్ని సంకల్పంతో ఎదుర్కొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నమెంట్స్‌లో రాణిస్తూ ఎన్నో ట్రోఫీలు, అవార్డులు అందుకొని యువతలో ఆత్మస్థైర్యం నింపుతున్నాడు. అంతేకాదండోయ్‌ ఇటీవల నేపాల్‌ జట్టుతో జరిగిన అంతర్జాతీయ టీ-20 సీరీస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

పుట్టుకతోనే వైకల్యంతో జన్మించడం మనం అనుకున్నది కాదు. దాన్ని శాపంగా భావించి జీవితాన్ని నిస్సారంగా మార్చుకోవడమే పొరబాటు అంటున్నాడీ యువకుడు. చిన్నతనం నుంచి పేదరికం ఇబ్బందులు పెడుతున్నా, వైకల్యం భారంగా మారినా, ఆశయాన్ని చంపుకోలేక తనకు ఇష్టమైన క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, ట్రోఫీలు సాధించి అందరి మన్ననలను పొందుతున్నాడు.

నేపథ్యం: సాధన చేస్తున్న ఈ యువకుడి పేరు శివకోటి. అన్నమయ్య జిల్లా నందలూరుకు చెందిన వెంకటేశ్, సుబ్బలక్ష్మమ్మ కుమారుడు. పుట్టుకతోనే పోలియో సోకడంతో కుడిచేతి 5 వేళ్లు సరిగ్గా లేవు. ఐతేనేం ఎడమచేతితోనే బ్యాటింగ్‌, బౌలర్‌గా రాణిస్తున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయి మ్యాచ్‌ల్లో టెక్నిక్స్‌తో బౌలింగ్‌ వేసి అందరిదృష్టి ఆకర్షించాడు. స్థానికులు, దివ్యాంగుల క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రోత్సాహంతో జాతీయ, అంతర్జాతీయ సిరీస్‌లలో పాల్గొనే అవకాశం లభించింది.

చిన్నతనంనుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడీ యువకుడు. అనంతరం కఠోర సాధన చేసి ఏ టోర్నమెంట్‌కు వెళ్లినా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు. 20 ఏళ్లలో వందల సిరీస్‌లలో పాల్గొని ట్రోఫీలు, కప్పులు, ప్రశంసాపత్రాలు సాధించాడు. 2007లో అనంతపురంలో జరిగిన దివ్యాంగుల ఇండియన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికై మాజీ క్రికెటర్‌ అజిత్‌ వాడేకర్‌ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో ట్రోఫీలు: కర్నాటకలో నిర్వహించిన జాతీయ క్రికెట్‌ టోర్నీలో కప్‌ సొంతం చేసుకున్నాడీ యువకుడు. ఆల్‌ ఇండియన్‌ క్రికెట్‌ ఛాంపియన్‌ షిప్‌ టోర్నమెంట్‌లో మాజీ స్పిన్నర్‌ కుంబ్లే చేతుల మీదుగా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ట్రోఫీ అందుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల క్రికెట్‌ టోర్నీలో ఇండియా, బాంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో సత్తాచాటాడు . నేపాల్‌లో భారత్‌, నేపాల్‌ జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌లకు కెప్టన్‌గా బాధ్యతలు స్వీకరించి టోర్నీ క్లీన్‌ స్వీప్‌ చేశాడు.

అంతర్జాతీయస్థాయిలో దివ్యాంగుల క్రికెట్‌ టోర్నీల్లో రాణించినప్పటికీ సరైన ప్రోత్సహం లేదంటున్నాడీ యువకుడు. ఇంట్లో వందల సంఖ్యలో ట్రోఫీలు ఉన్నా కుటుంబ పోషణకు అవసరమయ్యే ఉద్యోగం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విభిన్న ప్రతిభావంతులకు కూడా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ప్రభుత్వం ప్రోత్సాకాలివ్వాలందివ్వాలని విజ్ఞప్తి: స్థానిక మిత్రులు, అసోసియేషన్‌ సభ్యుల సహకారంతో క్రీడా మైదానంలో రోజు ఉదయం , సాయంత్రం యువతకు ఉచితంగా క్రికెట్‌లో మెళకువలు నేర్పిస్తున్నాడీ యువకుడు. కానీ ఆశించినస్థాయి ప్రోత్సాహం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి క్రీడా కోటాలో కనీసం వాచ్‌మెన్‌ కొలువైనా కల్పించాలని కోరుకుంటున్నారు.

శివకోటి సాధిస్తున్న విజయాలు ఇండియాకు అందిస్తున్న సేవలకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించం చాలా గర్వంగా ఉందంటున్నారు. క్రికెట్‌పై మక్కువతో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు శివకోటి. కష్టాలకు ఎదురెళ్లితేనే విజయం వరిస్తుందంటున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దేశానికి మరిన్ని ట్రోఫీలు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

''చిన్నతనం నుంచి నాకు క్రికెట్‌ అంటే ఆసక్తి. 2007 లో అనంతపురంలో జరిగిన దివ్యాంగుల ఇండియన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాను. మాజీ క్రికెటర్‌ అజిత్‌ వాడేకర్‌ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాను. కర్నాటకలో నిర్వహించిన జాతీయ క్రికెట్‌ టోర్నీలో కప్‌ సొంతం చేసుకున్నాను. ఆల్‌ ఇండియన్‌ క్రికెట్‌ ఛాంపియన్‌ షిప్‌ టోర్నమెంట్‌లో మాజీ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ట్రోఫీ అందుకున్నాను. ప్రభుత్వం స్పందించి నాకు ఏదైనా ఉద్యోగాన్ని కల్పించి ఉపాధిని కల్పించాలని కోరుతున్నాను''- శివకోటి, దివ్యాంగ క్రికెటర్

''మా అబ్బాయి క్రీడా మైదానంలో రోజు ఉదయం, సాయంత్రం యువతకు ఉచితంగా క్రికెట్‌లో మెళకువలు నేర్పిస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయి ప్రోత్సాహం మా అబ్బాయికి అందడం లేదు. ప్రభుత్వం స్పందించి క్రీడా కోటాలో కనీసం వాచ్‌మెన్‌ కొలువైనా కల్పించాలని కోరుకుంటున్నాం''-వెంకటేశ్, శివకోటి తండ్రి

కళారంగంపై మక్కువ - 24 క్రాఫ్ట్స్​లో పట్టు సాధించిన నవీన్​

కష్టపడింది - కల నెరవేర్చుకుంది - గీతా భార్గవి విజయగాథ ఇది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.