ETV Bharat / state

సమ్మర్​లో కరెంట్​ బిల్లు చూసి షాక్​ తిన్నారా - అయితే ఈ టిప్స్ పాటించండి

మీ ఇంట్లో ఈ చిన్నచిన్న టిప్స్ పాటిస్తే బోలెడు విద్యుత్తు ఆదా - అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం

TRICKS TO REDUCE ELECTRICITY BILL
TRICKS TO REDUCE ELECTRICITY BILL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2025 at 8:08 PM IST

|

Updated : March 6, 2025 at 7:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

TIPS TO REDUCE ELECTRICITY BILL: వామ్మో మార్చిలోనే సూరీడు సుర్రుమంటున్నాడు. ఇంట్లో ఉన్నా కూడా మాడు మాడిపోతోంది. ఉక్కపోతకు తాళలేక చల్లదనం కోసం పరుగులు తీస్తున్నాం. ఫ్యాన్లు గిర్రును తిరుగుతున్నాయి. ఏసీలు తిరగటం మొదలయ్యాయి. దీంతో విద్యుత్తు మీటరు భూచక్రంలా తిరుగుతోంది. ఇక కరెంటు బిల్లు చూసి గుండె గుబేల్ మనడం ఖాయం. అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరెంట్​​ బిల్లు తక్కువగా వస్తుందని విద్యుత్​ శాఖ అధికారులంటున్నారు.

అందుకే ఈ చిన్న టిప్స్ పాటించండి: అయితే కొన్ని చిన్నచిన్న టిప్స్ పాటిస్తే విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

  • సాధారణంగా ఫిలమెంట్‌ బల్బు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. కాబట్టి తక్కువ విద్యుత్తు తీసుకునే ఎల్‌ఈడీ బల్బును ఉపయోగించుకోవాలి.
  • 60 వాట్ల ఫిలమెంటు బల్బు ఇచ్చే వెలుగును కేవలం 9 వాట్స్‌ ఎల్‌ఈడీ బల్బు ఇస్తుంది.
  • బీఎల్‌డీసీ (Brushless Direct Current) టెక్నాలజీతో తయారు చేసిన ఫ్యాన్ల వాడకంతో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
  • రెగ్యులేటర్లు పనిచేయకుండా ఉంటే వెంటనే మార్పించుకోండి. ఎందుకంటే ఫ్యాన్ ఫుల్‌ స్పీడుతో తిరిగితే బిల్లు అధికంగా వస్తుంది. 1 లేదా 2 వేగంతో తిరిగితే విద్యుత్తు ఆదా అవుతుంది.
  • బేరింగ్‌ దెబ్బతిన్న శబ్ధం వస్తూ ఉంటే వెంటనే సరి చేపించుకోండి. ఎందుకంటే మోటారుపై లోడు ఎక్కువగా పడి విద్యుత్తు వినియోగం అధికం అవుతుంది.
  • ఏసీ (Air Conditioner) కెపాసిటీని సాధారణంగా టన్నుల్లో కొలుస్తారు. మామూలుగా ఒక టన్ను నుంచి రెండు టన్నుల వరకు ఏసీలు ఉంటాయి. ఎక్కువ స్టార్ ఉన్న ఏసీ అయితే తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఉదాహరణకు 3 స్టార్‌ ఏసీ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తే, 5 స్టార్‌ ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది.
  • 1000 వాట్ల ఏసీ ఒకగంట సేపు పని చేస్తే 1 యూనిట్‌ విద్యుత్తు కాలుతుంది. అదే 1500 వాట్ల ఏసీ గంటసేపు పనిచేస్తే 1.5 యూనిట్లు ఖర్చవుతుంది.
  • ఏసీ సెట్టింగ్‌ను 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది. అదే విధంగా ఎప్పటికప్పుడు ఏసీ పిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి.
  • బయట నుంచి వేడి గాలులు రాకుండా కర్టెన్లు వేసుకోవాలి. గంటల తరబడి ఏసీ ఆన్ చేసి ఉంచకుండా, కాసేపు వేసుకున్న తరువాత ఫ్యాన్‌ వేసుకుంటే రూమ్ చల్లగా ఉంటుంది.
  • ఇక ఫ్రిజ్‌ తలుపు ఒక్కసారి తెరవడం వలన అరగంట కూలింగ్‌ నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ సార్లు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయాలి.
  • ఫ్రిజ్​ను వేడి ఉన్న చోట్ల పెడితే ఎక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది.
  • ఫ్రిజ్ వెనుక భాగాన్ని గోడకు తగలకుండా గాలి వెళ్లేలా ఉంచాలి.
Last Updated : March 6, 2025 at 7:31 PM IST