Simhadri Appanna Chandanotsavam Preparation Works Doing Fastly : మరో 2 వారాల్లో జరగనున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సామాన్య భక్తులు సజావుగా దర్శనం చేసుకోవడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఈ ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సింహాచలేశుని నిజరూప దర్శనం కలిగించే చందనోత్సవం కోసం సింహగిరి ముస్తాబు అవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక తప్పిదాలు నిజరూప దర్శనానికి వచ్చే భక్తులను ఇక్కట్లపాలు చేశాయి. వీఐపీ పాసుల జారీ, టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఎదురైన అనేక సమస్యలు పరిష్కరించే సన్నాహాల్లో అధికార యంత్రాంగం ఉంది.
రూ.51 కోట్లతో పనులు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ పథకం కింద 51 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నారు. చందనోత్సవం రోజు భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్ కోసం అధికారులు మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టైం స్లాట్‌లను పాటించడం ద్వారా రద్దీని బాగా నియంత్రించేందుకు అవకాశం ఉంది.
మరో రెండు వారాల్లో : ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారికి చందనోత్సవం మరో రెండు వారాల్లో జరగనున్నది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తుడు సైతం సజావుగా దర్శనం చేసుకోవడమే లక్ష్యంగా ఈసారి ఏర్పాట్లు ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పలుమార్లు ఈ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా ప్రత్యేకంగా శాఖాపరంగా చర్యలు చేపట్టారు.
దర్శనానికి అంతరాయం లేకుండా : సామాన్య భక్తుల కోసం నిరంతరం క్యూలైన్లు నడిచే విధంగా దర్శనానికి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి టైమ్ స్లాట్ లను పాటించడం ద్వారా రద్దీని బాగా నియంత్రించేందుకు అవకాశం ఉందన్నది సుస్పష్టం. మరోవైపు ఎలాగైనా అవాంతరాలు ఎదురైతే వాటిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గతంలో అధికారంలో ఉన్న పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే కొన్ని ఘటనలు రుజువు చేశాయి. అటువంటి వాటిని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని దేవదాయ శాఖ భావిస్తోంది.
సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ- లక్షలాదిగా పోటెత్తిన భక్తులు - simhachalam giri pradakshina