ETV Bharat / state

స్మార్ట్‌ షూ ఇన్‌సోల్‌ - ఇవి వేసుకుంటే చాలు ఆరోగ్య సమస్యలు గుర్తించొచ్చు! - AU COLLEGE STUDENTS INNOVATION

ఏయూ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ

AU Women Engineering College Students Innovation
AU Women Engineering College Students Innovation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 10, 2025 at 8:18 AM IST

2 Min Read

AU Women Engineering College Students Innovation : టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చని నేటి యువత నిరూపిస్తుంది. చదువుకుంటూనే పలు ఆసక్తికరమైన అవిష్కరణలు చేసి వారెవ్వా అనిపించుకుంటున్నారు. తక్కువ ధరతో మంచి సౌకర్యాలతో పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఉపయోగకరమైన వస్తువులను అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అటువంటి మేటి పరికరంతో ఏయూ ఇంజినీరింగ్​ విద్యార్థులు ప్రతిభ చాటారు. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఆ పాదరక్షలు ధరించి నడిస్తే చాలు ఈసీజీతోపాటు గుండె కొట్టుకునే వేగం, శ్వాసక్రియ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ వినూత్న సాంకేతికతను ఏయూ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థినులు షైనీ దరావత్, ఉషశ్రీ, జహేరా, జయప్రియలు ఆవిష్కరించారు. మిగతా విద్యార్థినుల్లో అధికశాతం సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపగా, వీరు మాత్రం కొత్తగా చేయాలని ఆలోచించారు. వారి ఆలోచనల నుంచి పుట్టిందే ‘స్మార్ట్‌ షూ ఇన్‌సోల్‌’ (Smart Shoe Insole) పరికరం. వృద్ధులు, పలు వ్యాధులతో బాధపడేవారు తమ ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు వీలుగా ‘సోల్‌ సెన్స్‌’ అనే సర్క్యూట్‌ను రూపొందించారు.

AU Women Engineering College Students Innovation
తాము రూపొందించిన పరికరంతో విద్యార్థినులు ఉషశ్రీ, షైనీ దరావత్, జహేరా (ETV Bharat)

దాన్ని అమర్చిన పాదరక్షలు ధరించి, నడిచే వ్యక్తి ఈసీజీ, గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. ఎంత వేగంతో నడుస్తున్నారు, పాదం ఎలా పడుతుంది అనే అంశాలు సహా నడిచే క్రమంలో కాలు మడత పడితే, దానికి కారణాలు సైతం తెలుపుతుంది. ఒకవేళ కింద పడిపోతే ఎందువల్ల పడిపోయారనే విషయాన్ని శోధిస్తుంది. దీంతో పాదంపై పడే ఒత్తిడి వంటివి కూడా రికార్డవుతాయి. ఈ సర్క్యూట్‌లో నోడ్‌ ఎంసీయూ అనే వైఫై మాడ్యూల్‌ని అమర్చారు. దీని సాయంతో ఆరోగ్య సమాచారాన్ని వెబ్‌సైట్‌లో సైతం చూడొచ్చు. సర్క్యూట్‌లో జీపీఎస్‌ సైతం అమర్చడంతో సదరు వ్యక్తి ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం సర్క్యూట్‌ రూపంలో ఉన్న సోల్‌ సెన్స్‌ను చిప్‌గా మారుస్తామని, తద్వారా పాదరక్షలో సులువుగా అమర్చవచ్చని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఈ ఆవిష్కరణను పేటెంట్‌ హక్కు కోసం దరఖాస్తు చేసినట్లు వారు పేర్కొన్నారు.

బాంబూ బాటిల్‌, ఏసీ హెల్మెట్‌ - వినూత్న ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.