Safety Tips For Driving in The Rain : సాధారణంగానే జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే భయమేస్తోంది. ఇక వర్షకాలమైతే వామ్మో అంటూ హడలెత్తిపోతారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వాహనాలు అదుపు తప్పుతుండటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించాలంటే వాహనాల నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పరిమితవేగంతో జాగ్రత్తగా వాహనాలు నడపాలంటున్నారు. వేగాన్ని నియంత్రించుకోలేక చాలామంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి
- వర్షాకాలం వచ్చిందంటే తప్పనిసరిగా కారుకు ఉన్న విండ్‌షీల్డ్ వైపర్స్ సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఇవి సరిగా పని చేయకపోతే మెకానిక్ వద్దకు తీసుకెళ్లి చూపించి సరి చేయించాలి. అవసరమైతే కొత్తవి బిగించుకోవడం చాలా మేలు.
- వాహనాల టైర్లను చెక్ చేసుకోవాలి, వాటికి గ్రిప్ ఉందా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి. గ్రిప్ లేకపోతే వర్షాకాలంలో రహదారిపై ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టైర్లకు గ్రిప్ లేకపోతే కొత్తవి మార్చుకోవాలి.
- కారుకు ఉన్న లైట్లు, హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఫాగ్ లైట్లు, ఇండికేటర్లు పని చేస్తున్నాయా లేదా చూసుకోవాలి. పని చేయకపోతే వెంటనే మరమ్మతులు చేయించాలి.
- విండ్‌షీల్డ్ శుభ్రంగా ఉంచుకోవాలి.
- వర్షంలో కారు నడపాల్సి స్పీడ్ తగ్గించాలి. ఆ సమయంలో రహదారులు జారుడుగా ఉంటాయి. అందుకే సాధారణ వేగం కంటే తక్కువ స్పీడ్‌లో నడపడం సురక్షితం. జాతీయ రహదారులపై వేగ పరిమితిని కచ్ఛింతంగా పాటించాలి. వర్షం తీవ్రత అధికంగా ఉంటే నెమ్మదిగా వెళ్లాలి.
- జాతీయ రహదారులపై వాహనాలు నడిపే సమయంలో ముందు వెళ్లే వాహనాన్ని గమనిస్తుండాలి. దూరాన్ని పాటిస్తూ నడపాలి. ఇలా చేస్తే రహదారులపై బ్రేక్ వేయడానికి ఆస్కారం కలుగుతుంది.
- వాహనాలు నడిపే సమయంలో సడన్ బ్రేకులు వేయకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే వర్షం కారణంగా కారు టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. బ్రేకులు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
- రహదారిపై నీరు నిలిచి ఉంటే టైర్లు గ్రిప్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి స్థితిలో నీటిలో వెళ్తున్నప్పుడు వేగం తగ్గించాలి. స్టీరింగ్‌ను స్థిరంగా పట్టుకోవాలి.
- వర్షం ఎక్కువ పడుతుంటే ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో జాతీయ రహదారులపై ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసిన తర్వాత హజార్డ్ లైట్లను ఆన్‌చేయాలి. ముఖ్యంగా చెట్ల కింద పాత భవనాల పక్కన వాహనాలను పార్కింగ్ చేయకూడదు.
- వాహనాలకు రిఫ్లెక్షన్ టేపు సరిగా ఉండేలా చూడాలి.
- వర్షంలో వాహనాలు నడిపే సమయంలో విజిబిలిటీ సరిగా లేకపోతే హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు ఆన్ చేయండి. కానీ ఇతర డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహించాలి.
- విండ్‌షీల్డ్, కిటికీలపై పొగమంచు ఏర్పడకుండా డీఫాగర్ లేదా ఏసీ ఉపయోగించండి.
- రోడ్డు గుర్తులు, సిగ్నళ్లను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వర్షంలో అవి స్పష్టంగా కనిపించకపోవచ్చు.
- కారు నడిపే సమయంలో ఒకవేళ కారు స్కిడ్ అయితే భయపడకుండా కారు స్టీరింగ్‌ను మెల్లగా తిప్పాలి.
- కారులో ఎమర్జెన్సీ కిట్(ఫస్ట్ ఎయిడ్, టార్చ్, బ్లాంకెట్, నీరు, స్నాక్స్) ఉంచాలి.
- విండ్‌షీల్డ్ శుభ్రం చేయడానికి లేదా ఇతర అవసరాల కోసం టవల్ లేదా గుడ్డను కారులో ఉంచండి. ఇది సమయానికి ఉపయోగపడుతుంది.
- జాతీయ రహదారిపై కారు డ్రైవింగ్ చేసే సమయంలో రహదారి కండీషన్ తెలుసుకోవడంతో పాటు డ్రైవింగ్‌కు ముందు వాతావరణ నివేదికలు తెలుసుకోవడం మంచిది.
- కారు నడిపే సమయంలో పెద్ద శబ్ధంతో సంగీతాన్ని వినడం మానుకోవాలి. వర్షంపై దృష్టి సారించడం చాలా ముఖ్యం.
పిడుగులను గుర్తించండిలా- మెరుపుల వేళ ఈ మెలుకువలు తప్పనిసరి!
వాన కురుస్తున్నప్పుడు నడపడం సవాలే : జాతీయ, రాష్ట్ర రహదారులపై రోజూ వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వానలు కురుస్తున్నప్పుడు వాహనాలు నడపడం సవాలుగా మారుతోంది. ఎదురుగా వచ్చేవి కన్పించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పిల్లల కళ్లెదుటే తల్లిదండ్రులు మృతి - దేవరపల్లి వద్ద ఘోర ప్రమాదం