ETV Bharat / state

నిరుద్యోగులకు సజ్జనార్ గుడ్​న్యూస్ - త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి - RTC TO RECRUIT 3038 POSTS

ఆర్టీసీలో పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి యాజమాన్యం యోచన - త్వరలోనే 3038 పోస్టుల భర్తీ - కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TGSRTC To Recruit 3038 posts
TGSRTC To Recruit 3038 posts (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 15, 2025 at 11:28 AM IST

1 Min Read

TGSRTC To Recruit 3038 posts : తెలంగాణ ఆర్టీసీ సంస్థలో 3,038 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని, ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పని భారం తగ్గుతుందని ఆయన వివరించారు. సోమవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమానికి సజ్జనార్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్‌ చిత్ర పటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు : కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సజ్జనార్​ పేర్కొన్నారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, ఉషాదేవి, రాజశేఖర్, వెంకన్న, జాయింట్‌ డైరెక్టర్లు నర్మద, రంగారెడ్డి జిల్లా రీజినల్‌ మేనేజర్‌ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థికి గుండెనొప్పి - సకాలంలో స్పందించిన సిబ్బందికి సజ్జనార్‌ సన్మానం

అది పూర్తిగా ఎడిటెడ్ వీడియో - ఆర్టీసీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం చేస్తే చర్యలు పక్కా : టీజీఎస్​ఆర్టీసీ ఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.