Road for A Village With 13 Houses for 2 Crores in Manyam District : గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతల గురించి తెలిసిందే. దశాబ్దాలుగా వారు పడుతున్న వెతలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అన్నది కలగానే మిగిలిపోతుందనుకున్నారు. పదుల సంఖ్యలో గ్రామాలు దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. వందల మంది ఉన్న ఊర్లకు రోడ్డు సదుపాయం లేని రోజుల నుంచి కేవలం 13 ఇళ్లున్న గ్రామానికి రోడ్డు వేయిస్తుంది కూటమి ప్రభుత్వం. ఏళ్ల నాటి కల సాకారమవుతుందని ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అవన్నీ ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉంటాయి. ఈ ప్రాంతానికి ఇంత వరకు పక్కా రహదారి సదుపాయం లేదు. అది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణాం పంచాయతీ శిఖరాగ్ర గ్రామం బింగుడువలసకు ఎట్టకేలకు రహదారి నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆ గ్రామానికి రహదారి లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామానికి మట్టి రోడ్డు వేసే ప్రయత్నం చేశారు. కిలోమీటరున్నర దూరమున్న ఈ మార్గంలో కేవలం 400 మీటర్లు వేసిన తర్వాత నిధులు చాలకపోవడంతో పనులు ఆగిపోయాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆ రహదారి గురించి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం దిగువమెండంగి-బూర్జ ప్రధాన రహదారి నుంచి శిఖరాగ్ర గ్రామం బింగుడువలసకు 1.4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేస్తోంది. దీని కోసం రూ.2 కోట్లు మంజూరు చేసింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామంలో కేవలం 13 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. 55 మంది జనాభా. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఐటీడీఏ ఏఈ సంతోష్‌కుమార్ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు-రూ.3868.89 కోట్లతో అయిదు దశల్లో పనులు
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాలన్నింటికీ ప్రాధాన్యత క్రమంలో పక్కా రహదారి సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంతకుముందే స్పష్టం చేశారు. శుక్రవారం కురుపాం మండలం జి.శివడ పంచాయతీలోని జి. శివడ నుంచి రాముడుగూడ వరకు రూ.90 లక్షలతో తారు రోడ్డు అలాగే రాముడుగూడ నుంచి కీడవాయి వరకు రూ.2 కోట్లతో నిర్మించిన తారురోడ్డు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
గుంతల రోడ్లకు గుడ్ బై - రయ్‌రయ్‌మంటూ రైడ్!