Road Accident In Satyasai District: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వివరాల్లోనికి వెళ్తే
ఇదీ జరిగింది? హిందూపురం మండలం కోటిపి శ్రీ చౌడేశ్వరి ఆలయంలో మొక్కులు తీర్చుకొని ఆలయ నిద్ర చేసి తెల్లారగానే వారి స్వగ్రామమైన రోద్దం మండలం దొడగట్ట కు బయలుదేరారు. మడకశిర హైవే ధనాపురం క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం అంతే వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రొద్దం మండలం దొడగట్టకు చెందిన అలివేలమ్మ, ఆది లక్ష్మమ్మ, సాకమ్మ,అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 6 మంది గాయపడ్డారు వీరిని హిందూపురం ప్రభుత్వ తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పరిగి ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని రోదనలు మిన్నంటాయి.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం: సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Road Accident In Ananthapur District: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఆత్మకూరు మండలం తలపూరు గ్రామానికి చెందిన నాగార్జున(28) తన పెద్దనాన్న నారాయణను గొర్రెల మంద వద్ద వదిలి రావడానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో కూడేరు శివారులో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు బీటెక్ పూర్తి చేసి, బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి కొండన్న ఫిర్యాదు మేరకు కూడేరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - రెండు ప్రైవేటు బస్సులు ఢీ