ETV Bharat / state

కడప జిల్లాలో స్కార్పియో బీభత్సం - ముగ్గురు మృతి - ROAD ACCIDENT IN KADAPA DISTRICT

వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో - ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

Road Accident in Kadapa District
Road Accident in Kadapa District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 14, 2025 at 5:54 PM IST

1 Min Read

Road Accident in Kadapa District : కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న రెండు వాహనాలను స్కార్పియో వాహనం వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్, మరో డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అత్యంత వేగంగా నడింపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును, పోలీసు రక్షక వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.

అక్కడికక్కడే ముగ్గురు మృతి : ఈ తాకిడికి స్కార్పియో వాహనం టాప్ మొత్తం లేచిపోయి పక్కకు పడింది. ఆ సీట్లలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ప్రమాదంలో పోలీసు వాహనం పక్కనే ఉన్న మరో చెట్టుకు ఢీకొనడంతో అందులో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డి, డ్రైవరు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్​కు తరలించారు. స్కార్పియో వాహనంలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తులు నంద్యాల జిల్లా కేంద్రమైన హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం కోసం కడప రిమ్స్​కు తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు నెల్లూరుజిల్లా రాపూరులో రోడ్డు ప్రమాదం ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రాపూరులోని తిక్కన పార్కు వద్ద బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు సరస్వతి (40), సురేష్ (30)గా గుర్తించారు.

బైక్‌పై నుంచి కిందపడిన పాస్టర్‌ ప్రవీణ్‌ - వెలుగులోకి మరో సీసీటీవీ ఫుటేజ్

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం- గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కోని ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.