ETV Bharat / state

పట్టాలే కాదు సంతకాలు ఫోర్జరీ! - పేర్ని నాని ప్రమేయంపై రెవెన్యూ సిబ్బంది విచారణ - PERNI NANI FAKE HOUSE PATTAS CASE

నకిలీ పట్టాల పంపిణీపై లోతుగా దర్యాప్తు చేస్తున్న రెవెన్యూ అధికారులు - పేర్ని నాని, ఆయన కుమారుడి ప్రమేయంపై ఆరా

perni-nani-fake-house-pattas-case
perni-nani-fake-house-pattas-case (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 21, 2025 at 10:36 AM IST

2 Min Read

Perni Nani Fake house Pattas Case: మచిలీపట్నం నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో అక్రమార్కుల మెడకు ఉచ్చు బిగించేలా రెవెన్యూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కనుసన్నల్లోనే జరగటంతో వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. నకిలీ పట్టాలు ఎవరు ముద్రించారు? వాటిపై ఉన్న సంతకాలు నిజమైనా అధికారులవా? పట్టాలు ఇచ్చిన ల్యాండ్ ఎక్కడుంది? అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.

మచిలీపట్నం కేంద్రంగా ఎన్నికల ముందు జరిగిన నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నగరంలోని రహదారుల పక్కనున్న మార్జిన్‌ స్థలాలు, చెరువుగట్లు, శ్మశానవాటికలను చూపిస్తూ వాటికి నకిలీ సర్వే నంబర్లను వేసి ఎంతమందికి పట్టాలు ఇచ్చారనే కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. మరో మూడు రోజుల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన పూర్తికానున్నట్టు తెలుస్తోంది. లేని భూమి ఉన్నట్టు చూపిస్తూ ఎలా పట్టాలు ఇచ్చారు? వీటిపై సంతకాలు చేసిన అధికారులు ఎవరు? వారి ప్రమేయంతోనే ఈ పట్టాల ముద్రణ జరిగిందా? లేక వారి సంతకాలు సైతం నకిలీవి పెట్టారా? అనే విషయాలను అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. నకిలీ పట్టాల పంపిణీ జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రస్తుతం సేకరిస్తున్నారు.

పట్టాలే కాదు సంతకాలు కూడా నకిలీవేనా?-పేర్ని ఫ్రాడ్​పై రెవెన్యూ సిబ్బంది విచారణ (ETV)

వంశీపై చర్యలు సరే గానీ పేర్ని కిట్టు సంగతేంటి?

పేదలను నమ్మించి మోసం చేసేందుకు పంచిన ఈ నకిలీ పట్టాలు ఇప్పటికీ వారి దగ్గరే ఉన్నాయి. వాటిని సైతం అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. నగరంలోని స్ట్రీట్‌ఫీల్డ్‌ స్థలాలు, కరగ్రహారం, చిలకలపూడి తదితర ప్రాంతాల్లో పట్టాలు ఇస్తున్నట్లు అర్థరాత్రి వేళ నకిలీ పట్టాలు ముద్రించి మరీ పంచిపెట్టారు. ప్రస్తుతం ఆర్డీవో, తహసీల్దార్, జిల్లా రెవెన్యూ కార్యాలయాల పరిధిలో సర్వే నంబర్ల వారీగా నకిలీ పట్టాలకు సంబంధించిన రికార్డులను ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తున్నారు. మచిలీపట్నం తహసీల్దారు కార్యాలయంలో రాత్రి సమయంలో పట్టాలను ఎందుకు ముద్రించారు, ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరు? వారికి ఏం చెప్పి అర్థరాత్రి సమయంలో విధుల్లో పాల్గొనేలా చేశారనే అంశంపై అంతర్గత విచారణ చేస్తున్నారు.

అర్థరాత్రి ముద్రించిన ఈ పట్టాలు అసలైనవైతే వాటిపై రాజముద్ర ఎందుకు లేదు? అప్పటి తహసీల్దార్‌ సునీల్‌బాబు సంతకాలు సైతం రకరకాలుగా ఎందుకున్నాయి.? వీటిని కూడా ఫోర్జరీ చేశారా? ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో మచిలీపట్నం కేంద్రంగా పంచిన పట్టాల్లో అసలైనవి ఎన్ని? నకిలీవి ఎన్ని? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఈ నకిలీ పట్టాల పంపిణీ వివాదంగా మారడంతో జేసీ గీతాంజలి శర్మ వచ్చి పరిశీలించాకే వీఆర్‌వోను సస్పెండ్‌ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ను బదిలీ చేశారు. కానీ ఆ తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా ఎందుకు పక్కన పెట్టేశారు? ఈ పట్టాలను పంపిణీ చేసిన సమయంలో మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇవి చెల్లుబాటు అవుతాయంటూ వైఎస్సార్సీపీ నేతలు స్పష్టంగా తమతో చెప్పారంటూ ఈ పట్టాలు అందుకున్న చాలామంది చెబుతున్నారు. అలా ఎందుకు చెప్పారనే దానిపైనా అధికారులు దృష్టి సారించారు.

పేర్ని నాని పాపం పండింది - ఇక వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.