Air India Plane Crash Ahmedabad : అహ్మదాబాద్‌లో జరిగిన విషాదం మాటలకందనిది. మృతులకు నివాళ్లు అర్పించడం తప్ప మిగతా విచారణ గురించి సంయమనం పాటించాలని చెబుతున్నారు విశ్రాంత వింగ్ కమాండర్ మంతెన జగన్‌మోహన్ రాజు. అసలు ప్రమాదం జరగడానికి కారణాలు బహుశా ఏమై ఉండొచ్చు ఈ ప్రమాద సమయంలో వినిపిస్తున్న సాంకేతిక పదాలకు అర్థాలేంటి? ఏఏ సందర్భాల్లో వాడతారు. విచారణ సమయంలో ఏ ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నారనే అంశాలపై జగన్‌మోహన్ రాజుతో ఈటీవీ ముఖాముఖి.
విమాన రంగానికి సంబంధించి ఉపయోగించే మేడేకాల్, బ్లాక్‌బాక్స్ అసలివేంటి?
విమానం ఎప్పుడైతే ప్రమాదంలో ఉందని పైలట్ గ్రహించి ల్యాండ్ చేయాలనే నిర్ణయానికి వస్తారో అప్పుడు కెప్టెన్ గానీ సెకండ్‌హ్యాండ్ కమాండ్ గానీ మేడేకాల్ను ఎనౌన్స్ చేస్తారు. మేడే, మేడే, మేడే అని మూడుసార్లు ఎనౌన్స్ చేస్తారు. అహ్మదాబాద్‌లో మనం చూసింది క్రాస్ల్యాండింగ్ సిచ్యువేషన్.
బ్లాక్‌బాక్స్‌లో ఏముంటుంది?
బ్లాక్‌బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది తొలిరోజుల్లో వాడేవారు. ప్రస్తుతం డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్‌ను ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌తో ఉంటుంది. ఎయిర్‌క్రూ, పైలట్, సెకండ్‌హ్యాండ్ కమాండ్, కాక్‌పిట్‌ల, ఎక్స్టర్నల్ల నుంచి వచ్చే ప్రతి కమ్యునికేషన్‌ను కూడా రికార్డ్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ పవర్ ఆన్ అయినప్పటి నుంచి పవర్ ఆఫ్ అయిన 5 నిమిషాల వరకు కూడా రికార్డ్ అవుతుంది. కంట్రోల్ సర్పేస్, ఫ్యూయల్, ప్రతి ఇంజిన్ పారామీటర్, ఎవియానిక్స్, పైలట్ ఇచ్చిన కమాండ్స్ ఇందులో రికార్డయి ఉంటాయి. ప్రమాద ఘటనలను విశ్లేషించేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి.
రెండు ఇంజిన్లు పనిచేయనప్పుడు ఉపయోగించే ఫెడెక్ అంటే ఏమిటి?
రెండు ఇంజిన్లు పనిచేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఈ సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు. ఎలా ప్రమాదం జరిగిందనేది విచారణలో తేలాల్సి ఉంది. నేటి రోజుల్లో అత్యాధునిక ఇంజిన్లను వాడుతున్నారు. డిజిటల్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ అందుబాటులోకి వచ్చాక బేలన్స్డ్గా ఎయిర్ క్రాఫ్ట్‌ను పెట్టేందుకు అవి చాలా ఉపయోగపడుతున్నాయన్నారు.
ఇంతపెద్ద ప్రమదానికి కారణాలు ఏమై ఉండవచ్చని మీరు విశ్లేషిస్తారు.
ఇది చాలా అరుదైన ఘటన. టేక్ ఆఫ్ అయిన సమయంలో రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఇలాంటి ప్రమాదం జరగడంపై మనం ఒకసారి దీనిపై లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇంత విషాదం జరిగిన సమయంలో వాస్తవాలు తెలియకుండా దాని గురించి మాట్లాకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. ఏం జరిగిందనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
విచారణ జరిగే సమయంలో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది?
వారు(దర్యాప్తు అధికారులు) ఏ కోణం కూడా విడిచిపెట్టారు. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ తనిఖీ చేస్తారు. ప్రమాదంలో ఎక్కడ ఏమైందనే విషయంపై పరిశీలిస్తారు. ప్రతి చిన్న పార్ట్ కూడా తీసుకువెళ్లి సిస్టమ్యాటికల్లీ రికన్‌స్ట్రక్ట్ చేసి దర్యాప్తు చేస్తారు. మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది. అది స్వతంత్ర సంస్థ. మ్యాన్యుఫ్యాక్ఛరింగ్ సైడ్‌నుంచి యూఎస్ నుంచి నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫిటీ బోర్డ్ నుంచి అధికారులు వస్తారు.
'మృత్యు' విమానానికి 265 మంది బలి- అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ
ఎలా బతికానో నాకే తెలియట్లేదు- మొత్తం కళ్ల ముందే జరిగింది: 'మృత్యుంజయుడు' విశ్వాస్