Rayapati Sailaja Taking Charge Women Commission Chairperson: సామాజిక మాధ్యమాలలో మహిళలపై జరుగుతున్న వేధింపుల కేసులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఛైర్పర్సన్గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు. రాయపాటి శైలజను ప్రముఖ వైద్యులు రమేశ్ బాబు, రాయపాటి శ్రీనివాసరావు, కమిషన్ కార్యాలయ సిబ్బంది కలిసి ఘనంగా సత్కరించారు.
అమరావతి ఉద్యమ సమయంలో మహిళలపై పెట్టిన కేసులను అప్పటి ఛైర్పర్సన్ రాజకీయ కోణంలో చూసి వాటిని పట్టించుకోలేదని శైలజ ఆరోపించారు. మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగిన కమిషన్ తోడుగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె చెప్పారు. మహిళలను ఎలా గౌరవించాలనే అంశంపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ తెలియజేశారు.
''అమరావతి ఉద్యమ సమయంలో మహిళలపై పెట్టిన కేసులను అప్పటి ఛైర్పర్సన్ రాజకీయ కారణాలతో పట్టించుకోలేదు. మహిళలకు న్యాయం జరిగేలా నేను కృషి చేస్తాను. మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను త్వరలోనే ప్రారంభిస్తాం. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని మహిళలందరికీ న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తాను''-రాయపాటి శైలజ, మహిళా కమిషన్ ఛైర్పర్సన్
'పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు'
'పోలీసులు ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం'