ETV Bharat / state

మూడేళ్ల బాలికపై అత్యాచారం?- ముళ్లపొదల్లో మృతదేహం - RAPE ON THREE YEARS GIRL IN KADAPA

కడపలో దారుణం- మూడేళ్ల చిన్నారిపై హత్యచారం -నిందితుడికి దేహశుద్ది

rape_on_three_years_girl_in_kadapa_district
rape_on_three_years_girl_in_kadapa_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2025 at 8:17 PM IST

1 Min Read

Rape on Three Years Girl in Kadapa District : కడప జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. అభం శుభం తెలియని మూడేళ్ల బాలికను ఓ వ్యక్తి హత్యాచారం చేసిన దారుణం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వెళ్లిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసినట్లు సమాచారం. స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని బంధువుల పెళ్లి నిమిత్తం మైలవరం మండలం కంబాలదిన్నేకు వెళ్లారు. మూడేళ్ల బాలిక పెళ్లి మండపం బయట ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేసినట్లు తెలిసింది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో గాలించారు. ముళ్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పసిపిల్లలపై ఆగని అకృత్యాలు - తెలిసిన వాళ్లే 'కీచకులు'!

మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం - 4 రోజులు నిర్బంధించి దారుణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.