ETV Bharat / state

స్వయంకృషితో మహావృక్షమై ఎదిగిన శ్రమజీవి రామోజీరావు - RAMOJI RAO LIFE STORY

సామాన్య రైతు కుటుంబంలో పుట్టి దీక్షాదక్షతలతో మహావ్యవస్థగా ఎదిగిన ధీరోదాత్తుడు - రాయిని రత్నంగా మార్చగల, శిలను శిల్పంగా చెక్కగల నైపుణ్యం

RAMOJI RAO LIFE STORY
RAMOJI RAO LIFE STORY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 8, 2025 at 8:43 AM IST

9 Min Read

Ramoji Rao Life Story on First Death Anniversary: రామోజీరావు. అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తెలుగు శిఖరం. ఆయన జీవితమే ఒక పోరాటం. ప్రతి పోరాటం ఒక గెలుపు పాఠం. ఆయన ఆలోచన నిత్యనూతనం. నిరంతర అధ్యయనం రామోజీ నైజం. వేయి బాహువులు, వేయి మెదళ్ల కలయికతో చేసే పని ఒక్కడే చేయగల సమర్థుడు. సంస్థల నిర్మాణంలో బాహుబలి. బృందంలో అచంచల విశ్వాసం నింపే నాయకుడు. ధర్మాగ్రహమే ఆయుధంగా వ్యవస్థలను ఢీకొట్టిన ధీశాలి. ఒక వ్యక్తి జీవితకాలంలో ఇన్ని వైవిధ్యమైన పనులు చేయగలరా? ఇన్ని విజయాలు సాధించగలరా? అని ఆశ్చర్యపోయే విజయ ప్రస్థానం రామోజీరావు సొంతం.

ఎలాంటి పరిస్థితైనా ధైర్యంగా ఎదుర్కోవడమే: సామాన్య రైతు కుటుంబంలో పుట్టి దీక్షాదక్షతలతో ముందుకు సాగి మహా వ్యవస్థగా ఎదిగిన ధీరోదాత్తుడు రామోజీరావు. ఆయన పట్టిందల్లా బంగారమని కొందరు అంటారు. కానీ దాని వెనుక ఎంత ఆలోచన, వ్యూహం, కష్టం, కృషి, పట్టుదల ఉంటాయో అని ఆలోచించేవారు తక్కువ. రాయిని రత్నంగా మార్చగల, శిలను శిల్పంగా చెక్కగల నైపుణ్యం ఆయనది. ప్రతికూల పరిస్థితుల్ని కూడా సానుకూలంగా మలుచుకోవడం రామోజీరావు ప్రత్యేకత. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడం, ధైర్యంగా ఎదుర్కోవడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య. ఏ రంగంలో అడుగు పెట్టినా అత్యున్నత స్థాయికి చేరేదాకా పట్టు విడవకపోవడం రామోజీ సహజగుణం. తాను నమ్మిన దారిలో జట్టును నడిపించగల సమర్థత, కార్యదక్షత కలిగిన లీడర్‌.

Ramoji Rao Life Story
రామోజీరావు సిద్ధాంతాలు (ETV Bharat)

ప్రయోగాలకు పుట్టినిల్లు ఈనాడు: పొద్దుపొడుపునకు ముందే వాకిట వచ్చి వాలే ఈనాడుతో తెలుగునాట సమాచార విప్లవం సృష్టించారు రామోజీరావు. పత్రికా రంగంలో లెక్కకుమిక్కిలిగా ప్రయోగాలు చేశారు. విలువైన ప్రమాణాలు నెలకొల్పారు. జీవితకాలం వాటిని పాటించారు. భారత మీడియా రంగంలో చెరగని చరిత్ర రాసుకున్నారు. రంగుల హెడ్డింగ్‌లు, రంగురంగుల ఫొటోలు, జిల్లా టాబ్లాయిడ్లు, ఫుల్లవుట్‌, ప్రత్యేక పేజీలు, మహిళల కోసం వసుంధర, మల్టిపుల్‌ ఎడిషన్లు ప్రింటింగ్‌లో ఆధునిక టెక్నాలజీ ఇలా ప్రయోగాలకు ఈనాడు పుట్టినిల్లయింది. ఆదివారం అనుబంధాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం పత్రికా రంగంలో పెనుసంచలనం. చదువు, సుఖీభవ, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్‌బుజ్జీ, మకరందం, ఆహాలతో తెలుగు పాఠక లోకానికి ఎప్పుడేం కావాలో తెలుసుకుని మరీ అందించడం ఈనాడు ప్రత్యేకత.

ఫొటోల విలువ గుర్తించిందీ ఆయనే: దినపత్రిక, వారపత్రిక, మాస పత్రికలు, బహు భాషా టీవీ చానళ్లు, వెబ్‌సైట్లు ఇలా విభిన్న మాధ్యమాల ద్వారా సమాచార వెల్లువతో సమాజాన్ని ఉన్నతీకరించిన యోధుడు రామోజీరావు. తెలుగు సమాజంలో జ్ఞాన జిజ్ఞాస, విషయ అవగాహన, రాజకీయ పరిజ్ఞానం పెంచడంలో ఈనాడు పాత్ర అపారం. ఊహకు అందని అంశాల్ని జనం ముంగిట్లోకి తెచ్చి తెలుగుజాతిని తట్టిలేపిన ఘనత రామోజీరావుదే. పత్రికల్లో ఫొటోల విలువ గుర్తించిందీ ఆయనే. కృత్రిమ ఛాయల్లేని ఛాయాచిత్రాలు ఈనాడు పేజీలకు వన్నె తెచ్చాయి. గుట్టలకొద్దీ ఫొటోల్ని ముందేసుకుని ప్రచురణ కోసం ఓ ఆణిముత్యాన్ని రామోజీరావు స్వయంగా ఎంపిక చేసిన సందర్భాలూ ఉండేవి. మరుసటిరోజు రచ్చబండ మీద, అసెంబ్లీలోనూ ఆ చర్చే. ఆర్ట్‌ ఆఫ్‌ చూజింగ్‌లో ఆయన తర్వాతే ఎవరైనా!

RAMOJI RAO LIFE STORY
రామోజీరావు కొటేషన్​ (ETV Bharat)

వృత్తిలో ప్రతిభ, పనితీరే ప్రామాణికం: పత్రికను ప్రజల చేతిలో అస్త్రంగా మలిచారు రామోజీరావు. తెలుగు సమాజంలో పెనుమార్పులకు బాటలు పరిచారు. 1983లో రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్లు పబ్లిక్‌గా ప్రకటించిన ధైర్యశీలి. ఆ నిర్ణయం రాష్ట్ర గతినే మార్చివేసింది. ఆ పని పూర్తవగానే ఇక తమది ప్రజల పక్షమని అంతే నేరుగా చెప్పేశారు. 1984లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలోనూ ఈనాడు పాత్ర అనన్యసామాన్యం . కంటెంట్‌లో ప్రొఫెషనలిజం, రిపోర్టింగ్‌ నెట్‌వర్క్‌లో సమగ్రత, పత్రికలో నాణ్యత, సర్క్యులేషన్‌, పంపిణీ, వాణిజ్య ప్రకటనలు అన్ని వ్యవహారాల్లో నిర్దిష్ట ప్రమాణాలు, ప్రోటోకాల్స్‌ ఏర్పాటు చేయడం రామోజీ ప్రత్యేకత. వృత్తిలో ప్రతిభ, పనితీరే ప్రామాణికమని చెప్పేవారు, అలాగే వ్యవహరించేవారు. వ్యక్తులతో నిమిత్తం లేకుండా నిర్విఘ్నంగా సాగేలా పత్రికను వ్యవస్థీకృతం చేశారు.

దేశవ్యాప్త మీడియాలో వారే కీలకం: మనిషి ముసలివాడైపోవచ్చు కానీ పత్రికకు వృద్ధాప్యం రాకూడదు నిత్యనూతనంగా ఉండాలి అనేవారు రామోజీరావు. మార్పును ఆమోదించని, వేగాన్ని అందుకోలేని జీవులు అంతే వేగంగా అంతరించిపోతాయి. సంస్థలకూ ఆ హెచ్చరిక వర్తిస్తుంది. 5 దశాబ్దాల ప్రస్థానంలో ఈనాడును నిలబెట్టిందీ, గెలిపించిందీ నిత్య నూతనత్వం, అలుపెరుగని వేగమే. పత్రిక సైనికుడి పాత్రకే పరిమితం కాకూడదు. ఉద్యమాల్లో శూన్యాన్ని భర్తీ చేయడానికి, విపత్తుల్లో దైన్యాన్ని పోగొట్టడానికి అవసరమైతే నాయకత్వ బాధ్యత స్వీకరించాలి. రామోజీరావు నినాదమూ, విధానమూ అదే. రామోజీ సంస్థల ద్వారా వేలమంది పాత్రికేయులు, వృత్తి నిపుణులు ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఈనాడు గ్రూపు సంస్థల్లో జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నవారే దేశవ్యాప్త మీడియాలో కీలకంగా ఉన్నారనడం నూటికి నూరుపాళ్లు నిజం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈనాడు, ఈటీవీతో అనుబంధం లేని భారతీయ జర్నలిస్ట్ ఉండరంటే అతిశయోక్తి కాదు.

RAMOJI RAO LIFE STORY
రామోజీరావు కొటేషన్​ (ETV Bharat)

తెలుగువారి చెంతకు ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిజ్ఞానం: ఈనాడు సంపాదకుడిగా ఎక్కడా రాజీ పడకుండా వ్యవస్థల్ని ఢీకొట్టిన సాహసికుడు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛ విషయంలో ఆయనది తలవంచని తత్వం. దేశంలో పత్రికా స్వేచ్ఛకు ఎక్కడ ఆటంకం కలిగినా ప్రతిఘటించారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో ఆయన పాత్ర ఎంతో క్రియాశీలం. అన్నదాత పత్రిక ద్వారా ఈనాడు కంటే అయిదేళ్ల ముందే పాత్రికేయంలోకి ప్రవేశించారు. ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిజ్ఞానాన్ని తెలుగువారి చెంతకు చేర్చిన అన్నదాత రామోజీరావు రైతు కుటుంబ మూలాలను గుర్తుచేసే సెంటిమెంట్.

ఉదయం ఈనాడు - రాత్రి ఈటీవీ న్యూస్​: పత్రికా రంగంలో ఈనాడు ఎన్ని ప్రయోగాలు చేసిందో, టీవీ మాధ్యమాన్ని ఎన్నెన్ని కొత్తపుంతలు తొక్కించిందో, జర్నలిజాన్ని ఎంతగా పదును తేలేటట్లు చేసిందో లెక్కే లేదు. ఈనాడు, ఈటీవీ న్యూస్‌ను ప్రతి తెలుగింటి ఎంపికగా మార్చేశారు రామోజీరావు. ఉదయాన్నే కాఫీ తాగుతూ ఈనాడు పేపర్‌ చదవడం, రాత్రి భోంచేస్తూ 9 గంటల ఈటీవీ న్యూస్‌ చూడటం తెలుగువారికి ఒక అలవాటుగా, జీవితంలో భాగంగా మారింది. ఈటీవీ 24 గంటల వార్తాఛానళ్లదీ ప్రత్యేకమైన శైలి. అనవసర రచ్చ, హడావుడికి బహు దూరంగా వాస్తవికతకు అతి దగ్గరగా ఛానళ్లు నడపడం రామోజీ ప్రత్యేకత. వీటికితోడు ఈటీవీ - అభిరుచి, హెల్త్, లైఫ్, ప్లస్‌, సినిమా ఈటీవీ నెట్‌వర్క్‌కు అదనపు ఆకర్షణ. బాలభారత్‌తో చిన్నారులకూ చేరువైంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లో ఛానళ్లు తీసుకొచ్చిన ఘనత రామోజీదే. ఈటీవీ భారత్‌తో అత్యాధునిక న్యూస్‌ నెట్‌వర్క్‌నూ నిర్మించారు.

పత్రికలో వాడుక భాష: రామోజీరావుకు తెలుగు భాషంటే ప్రాణం. ఆధునిక తెలుగుభాషా సేవకుల్లో అగ్రగణ్యుడు. పత్రికలో వాడుక భాషనే వాడాలని పట్టుబట్టారు. ప్రపంచీకరణతో తెలుగును ఇంగ్లిష్‌ మింగేస్తున్న విషయం గ్రహించి దాన్ని పరిహరించేందుకు పత్రిక, ఛానళ్ల ద్వారా కృషి చేశారు. విపుల, చతుర మాసపత్రికల ద్వారా వ్యవహారిక భాషలో కథలు, నవలలు అందించారు. తెలుగువెలుగు సాహితీ మాసపత్రిక, పిల్లల కోసం బాలభారతం మాసపత్రిక నడిపారు. తెలుగులో వ్యవహారిక పదకోశాన్ని అందుబాటులోకి తెచ్చారు. సినిమా సమాచారం కోసం "సితార" వార పత్రిక, న్యూస్‌టైమ్ పేరుతో ఆంగ్లపత్రికనూ నిర్వహించారు.

RAMOJI RAO LIFE STORY
రామోజీరావు కొటేషన్​ (ETV Bharat)

అపురూపంగా ఆయన సంతకంతో పంపిన లేఖలు: ప్రజల ఫీడ్‌బ్యాక్‌కు రామోజీరావు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. పత్రికా కథనాలపై ఎవరు అభ్యంతరాలు లేవనెత్తినా స్పందించి తిరుగు లేఖలు రాసేవారు. సహేతుక విమర్శలు చేస్తే, అభినందించి తప్పు దిద్దుకొనేవారు. ఆయన సంతకంతో లేఖలను అపురూపంగా దాచుకున్నవారు వేలమంది ఉంటారు. ఉద్యోగులు చెప్పిన విషయాలను కూడా రామోజీరావు అంతే శ్రద్ధగా వినేవారు. చాంతాడంత రిపోర్టులు రాసినా ప్రతి పదమూ చదివేవారు. ఎందులో ఏ మంచి ఆలోచన దాగి ఉంటుందో అన్నది ఆయన ఉద్దేశం.

ప్రతి ఇంట్లో మార్గదర్శి: చిట్‌ఫండ్‌ వ్యవస్థను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లిన మార్గదర్శి రామోజీరావు. 1962లో స్థాపించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆరు దశాబ్దాలకు పైగా లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి ప్రతి ఇంటి పొదుపు సాధనంగా మారింది. దేశంలోనే నెంబర్‌-1గా విరాజిల్లుతోంది. అలాంటి మార్గదర్శిని దెబ్బకొట్టేందుకు పాలకులు కుట్రలు చేసినా తలవంచని ధీరత్వం రామోజీరావుది. చిన్నచిన్న పుకార్లకే ఆర్థిక సంస్థలు కుప్పకూలుతున్న వేళ నేరుగా రాజ్యమే యుద్ధం ప్రకటించినా మార్గదర్శి పట్ల ప్రజల్లో నమ్మకం సడలలేదు. ఒక్క ఖాతాదారు కూడా విశ్వాసం కోల్పోలేదు. రామోజీరావు పట్ల ప్రజలకున్న నమ్మకం, వారితో ఆయన అనుబంధం అలాంటిది.

పరిశ్రమగా పచ్చళ్లు: ఆహారశుద్ధి రంగంలో తనదైన ముద్ర వేశారు రామోజీరావు. ఆయన వినూత్న వ్యాపార శైలికి ప్రియా పచ్చళ్లు ఓ ఉదాహరణ. ఇంటింటా పెట్టుకునే పచ్చళ్లను పరిశ్రమగా మార్చిన దార్శనికుడు. పచ్చళ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఆయన సృజనకు, దక్షతకు నిదర్శనం. ఎంతో ముందుచూపుతో విశాఖ సముద్ర తీరాన అధునాతన వసతులతో డాల్ఫిన్‌ హోటల్‌ నిర్మించి ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టారు. ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ మేటి హోటళ్లలో ఒకటిగా నిలిపారు. రామోజీ ఫిలిం సిటీకి వచ్చే అతిథులకూ డాల్ఫిన్స్‌ హోటల్స్‌ అద్భుత ఆతిథ్యం అందిస్తున్నాయి.

స్క్రిప్టుతో రండి - తుది ప్రింట్‌తో వెళ్లండి: నగరానికి దూరంగా సరైన రవాణా సౌకర్యమూ లేని కొండలు-గుట్టలు, రాళ్లు-రప్పలతో నిండిన భూముల్లో సినీ రంగానికే తలమానికంగా నిలిచే రామోజీ ఫిలింసిటీ నిర్మించడం రామోజీరావుకే సాధ్యమైంది. హైదరాబాద్‌ మహానగరానికి కొత్త చిరునామాగా, సరికొత్త సినీ ప్రపంచంగా, విహార కేంద్రంగా ఫిలింసిటీ ఎదగడంలో రామోజీరావు దూరదృష్టి, కార్యదక్షత, నైపుణ్యం, కృషి ఎనలేనివి. "స్క్రిప్టుతో రండి.. తుది ప్రింట్‌తో వెళ్లండి" అనేది ఇక్కడ కేవలం నినాదమే కాదు కళ్లెదుట నిలిచిన కమనీయ వాస్తవం. సకల సౌకర్యాల నెలవుగా రూపుదిద్దుకున్న R.F.C... దేశంలోని వివిధ భాషల చిత్రాలతో పాటు హాలీవుడ్ సినీ నిర్మాణాలకూ వేదికగా నిలిచింది. 3వేలకు పైగా సినిమాలు జీవం పోసుకున్న ఫిల్మ్‌ సిటీ... అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్‌ రికార్డులకెక్కింది. టీవీ సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌లూ R.F.Cలో నిర్మితమయ్యాయి. ఏటా దాదాపు 15 లక్షల మంది పర్యాటకులు రామోజీ ఫిలింసిటీని సందర్శించడం... భాగ్యనగరానికి ఒక వరం, ఒక గౌరవం.

కొత్త చరిత్ర: సినీ నిర్మాణంలోనూ రామోజీరావుది కొత్త పంథానే. ఆరోగ్యకరమైన వినోదానికి తోడుగా సందేశాత్మక చిత్రాలు నిర్మించాలన్న సంకల్పంతో 1983లో ఉషాకిరణ్‌ మూవీస్‌ ఏర్పాటు చేశారు. శ్రీవారికి ప్రేమలేఖతో సినీ ప్రయాణం ప్రారంభించి మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌తో పంపిణీ రంగంలోకీ అడుగు పెట్టారు. కథే హీరో అని బలంగా నమ్మిన ఆయన మయూరి, మౌనపోరాటం, ప్రతిఘటన వంటి సందేశాత్మక చిత్రాలతో చరిత్ర సృష్టించారు. చిన్న బడ్జెట్‌తో "చిత్రం”, "నువ్వేకావాలి" సినిమాలు తీసి భారీ వసూళ్లతో కొత్త చరిత్ర లిఖించారు. వందల మంది కొత్త తారలనూ కళాకారులనూ సాంకేతిక నిపుణులనూ వెండితెరకు పరిచయం చేశారు. ఈటీవీ-విన్‌తో O.T.T ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించిన రామోజీ గ్రూపు E - F.M.నూ విజయవంతంగా నడిపిస్తోంది.

పట్టాల కంటే పట్టుదలే ముఖ్యం: కష్టం, అసాధ్యం అనే పదాలు రామోజీరావుకు అస్సలు నచ్చేవికాదు. మనిషి తలచుకుంటే అసాధ్యం ఏముందని భావించేవారు. సవాళ్లు లేని జీవితం నిస్సారమన్నది ఆయన అభిప్రాయం. అవసరమైతే ఆ సవాలును తానే స్వీకరించి సమస్యలను సులువుగా అధిగమించేవారు. రామోజీరావు కర్తవ్య దీక్షోపదేశం చేస్తే బద్ధకస్తుడైనా శ్రమజీవి అవుతాడు. అంతర్ముఖుడైనా గడగడా మాట్లాడేస్తాడు. సాధారణ వ్యక్తులు సమష్టిగా అసాధారణ విజయాలు సాధిస్తారు. పట్టాలకంటే పట్టుదలే ముఖ్యమంటారు రామోజీరావు. ఎదుటి మనిషిలో మెరుపు కనిపిస్తే చాలు ప్రోత్సహించి, పదునుపెట్టి, తమను తాము నిరూపించుకునే అవకాశం ఇచ్చేవారు. వాళ్లకు అధినాయకుడే ఓ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌. ఆయన సూచనలే నాయకత్వ పాఠాలు.

బహుముఖ ప్రజ్ఞాశాలి: నిరంతర నవ చింతనాపరుడు రామోజీరావు. అనుకూల సందర్భాలను ఒడిసి పట్టుకుని ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని స్వయంకృషితో మహావృక్షమై ఎదిగిన శ్రమజీవి. తెలుగు రాష్ట్రాల అర్ధ శతాబ్దపు రాజకీయాలను, సామాజిక జీవనాన్ని ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యాపారవేత్తగా ఆరు దశాబ్దాల ప్రయాణంలో అద్భుత వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆ చెట్టు నీడన ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు భద్రజీవనయానం చేస్తున్నాయి. రామోజీరావు జీవితకాలంలో స్పృశించిన వ్యాపార రంగాలను చూస్తే భారతదేశ వాణిజ్యవేత్తల్లో చేతివేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత కొద్దిమందికే సాధ్యమైన వ్యవహారమది. భిన్న రంగాల్లో రామోజీరావు కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది.

రామోజీరావు కర్మయోగి. మార్పు అనివార్యమైన నేలపైన తప్పక ఉదయిస్తారు. జ్ఞానకాంతులు వెదజల్లుతారు..!

మహా స్వాప్నికుడా.. మళ్లీ జన్మించు!

రామోజీరావు జీవితం స్పూర్తిగా ముందడుగు వేద్దాం: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.