Rajendranagar Old Couple Death Mystery : అవమానించారనే కారణంతోనే ఈ నెల 5న రాజేంద్రనగర్‌లోని వృద్ధ దంపతులను నిందితులు హత్య చేసినట్లు సమాచారం. ప్రధాన నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ జనచైతన్య వెంచర్ పేస్-2లో అపార్ట్మెంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులను ఈ నెల 5న గుర్తు తెలియని ఇద్దరు హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్యకు ముందు నిందితులు బహదూర్‌పురా నుంచి రాజేంద్రనగర్ వచ్చి, అనంతరం అదే మార్గంలో వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రధాన నిందితుడు మెదక్ పారిపోయినట్లు తెలుసుకుని ఆదివారం రాత్రి అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బురఖా ధరించి : వృద్ధ దంపతులైన షేక్ అబుల్లా, రిజ్వానా ఇంట్లో సల్మాన్ రెండున్నర సంవత్సరాలుగా డ్రైవర్గా పని చేశాడు. అయితే అతన్ని వారు చీటికీమాటికీ తిడుతుండేవారు. 10 నెలల క్రితం పనిలో నుంచి తీసేసారు. ఆగ్రహం పెంచుకున్న డ్రైవర్ సల్మాన్ వారిని ఎలాగైనా హత్య చేయాలనుకున్నాడు. ఆ దంపతులు రాజేంద్రనగర్‌లోని జనచైతన్య వెంచర్‌లో అపార్ట్‌మెంట్ నిర్మించుకుని అక్కడికి మారినట్లు తెలుసుకుని ఈ నెల 5న మరొకరితో కలిసి వారింటికి వచ్చాడు. గుర్తిస్తే రానివ్వరని బురఖా ధరించాడు.
అతడితో పాటు వచ్చిన వ్యక్తి మాస్కు, క్యాపు పెట్టుకున్నాడు. దంపతులకు సన్నిహితులమని వాచ్‌మెన్‌కు చెప్పడంతో వారిని లోపలికి పంపించాడు. పైకి వెళ్లిన సల్మాన్ దంపతులను కత్తితో దారుణంగా హత్య చేశాడు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తి వెంటనే వెళ్లిపోయినా సల్మాన్ మాత్రం హత్య చేశాక కిందికి వచ్చాడు. అనంతరం వారిద్దరు వేర్వేరుగా పరారయ్యారు. ప్రస్తుతం సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడికి సహకరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
వర్షాలకు కూలిపోయిన డ్యామ్- వరదలకు 111 మంది మృతి
ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం ఎవరిదో తేలింది - పోలీసులు అదుపులో నిందితుడు