Rains in AP due to Low Pressure in Bay of Bengal: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. విశాఖలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు, బుధ, గురువారాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏప్రిల్ 11న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
పవన్ కాన్వాయ్ వల్లే విద్యార్థులు పరీక్షకు వెళ్లలేకపోయారా - విశాఖ సీపీ ఏమన్నారంటే?
అగ్నిప్రమాదం వల్ల మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది : పవన్ కల్యాణ్