ETV Bharat / state

పలు ప్రాంతాల్లో పోటెత్తిన వరద - వాగుల ఉద్ధృతికి రాకపోకలకు అంతరాయం - Overflowing Brooks and Meanders

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 2:32 PM IST

Overflowing Brooks and Meanders in AP : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారుల పైకి నీరు చేరి ప్రజలు అవస్థలకు గురయ్యారు. ఎగువ నుంచి వచ్చిన నీటితో కుంటలు, చెరువులు, జలాశయాలు నిండుకుండలా మారాయి.

rains_alert_ap
rains_alert_ap (ETV Bharat)
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటెత్తున్న వరద - వాగుల ఉద్ధృతికి రాకపోకలకు అంతరాయం (ETV Bharat)

Overflowing Brooks and Meanders in AP : కృష్ణా జిల్లా కవీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా - కట్టలేరుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వాగుపై ఉన్న దేవినేని వెంకట రమణ వారధిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. వైరా - కట్టలేరు వాగుకు భారీగా పోటెత్తుతున్న వరదతో వీరులపాడు మండలంలోని వీరులపాడు, పల్లంపల్లి గ్రామాలలో పంట పొలాలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు : ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం,బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, మండలాల్లో పాలచర్ల వాగు, అశ్వరావుపేట వాగు, జల్లేరు వాగులతో పాటు, తూర్పు కాలువ, గుంజవరం వాగు, దొండపూడి వాగులు ఉప్పొంగుతున్నాయి. వీటివల్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కొవ్వాడ జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొంగువారి గూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాయం నుంచి నాలుగు గేట్లను ఎత్తి 6500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు.

పలు ప్రాంతాల్లో వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Rain in Andhra Pradesh 2024

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు : భారీ వర్షాలకు తమ్మిలేరులో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరులోని శనివారపు పేట కాజ్ వే పై నుంచి వరద నీరు పోటెత్తింది. ఏలూరు నుంచి దుగ్గిరాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఏలూరు నగరంలో భారీగా స్తంభించిన ట్రాఫిక్ తో నగరవాసులు అవస్థలు పడుతున్నారు.

తమ్మిలేరులోకి పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా రావడంతో పడమటి లాకులను పూర్తిగా పైకి ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కొల్లేరు సరస్సు కు ఉన్న వరద ముప్పు పొంచి ఉంది. తమ్మిలేరు పరివాహక ప్రాంతాలను ఆర్డీవో ఖాజావలి, మున్సిపల్ , రెవెన్యూ అధికారులు. పరిశీలించారు.

రైతులకు క'న్నీరు' - లంక భూముల్లో కుళ్లిన పంటలు - Lanka villages farmers problems

రాకపోకలు బంద్​ : ఎన్టీఆర్​ జిల్లా తిరువూరు-అక్కపాలెం గ్రామాల మధ్య ఉన్న వంతెనపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

పులిచింతల ప్రాజెక్ట్​కు కృష్ణమ్మ పరవళ్లు - సంతోషంలో రైతులు - Pulichintala Project Gates Lifted

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.