Raghurama Responds to Dr Prabhavathi Statement: కష్టోడియల్ టార్చర్ కేసులో రఘురామ ఒంటిమీద గాయాలకు సంబంధించి తనకేమీ గుర్తు లేదని విచారణలో డాక్టర్ ప్రభావతి చెప్పడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పర్యటించిన ఆయన కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగా బెయిలు మంజూరు అయ్యే వరకూ అజ్ఞాతంలో ఉన్న డాక్టర్ ప్రభావతి, ఉపశమనం లభించిన వెంటనే జన బాహుళ్యంలోకి రావడంపై చమత్కరించారు.
వైద్యులు ఇచ్చిన నివేదికపై సంతకం చేశాను కానీ ఆయన ఒంటిపై గాయాల గురించి ఆమె అవగాహన లేదనడం హాస్యాస్పదకరంగా ఉందని అన్నారు. గాయాల గురించి ఎంబీబీఎస్ చేసిన ఎవరికైనా కనీస అవగాహన ఉంటుందన్న విషయం ఎలా మరిచారో ఆమెకే తెలియాలని రఘురామ కృష్ణరాజు అన్నారు.
Dr Prabhavati Police Inquiry : రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజుల పాటు డాక్టర్ ప్రభావతిని పోలీసులు విచారించారు. ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సోమ, మంగళవారాలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రశ్నించారు. రఘురామకు గాయాలు ఉన్నప్పటికీ గాయాలు లేవని మెడికల్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? ఎవరి ప్రోద్భలంతో ఇవ్వాల్సి వచ్చింది? ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ప్రభావతిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో ఆమె పొడిపొడిగా సమాధానాలు ఇచ్చారు.
రఘురామకృష్ణరాజుకు సీఐడీ కస్టడీలో గాయాలపై వైద్య నివేదిక కోసం హైకోర్టు సూచనల మేరకు సదరు కమిటీలో సీనియర్ డాక్టర్లను నియమించాల్సి ఉండగా మీరెందుకు జూనియర్ వైద్యులకు స్థానం కల్పించారు? రఘురామను పరీక్షించడానికి కార్డియాలజిస్టును పంపించింది ఎవరు? ఏదైనా కేసులో ఎవరికైనా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలంటే మీరు పాటించాల్సిన మార్గదర్శకాలు ఏంటి? ఈ కేసులో అవన్నీ పాటించారా? అనే ప్రశ్నలు పోలీసులు అడిగారు.
'దర్యాప్తునకు సహకరించాల్సిందే' - రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు - రెండో రోజు డాక్టర్ ప్రభావతిని ప్రశ్నించిన పోలీసులు