Raghurama Files Complaint Against Sajjala to DGP : రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు రఘురామ లేఖ రాశారు. అందులో కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దూషణలు అమరావతిలోని వేలాది మంది మనోభావాలను దెబ్బతీశాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు.
విలేకర్లతో మాట్లాడుతూ సజ్జల చేసిన వ్యాఖ్యలివీ : అమరావతి మహిళలపై సాక్షి ఛానెల్‌లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి సజ్జల నోరు పారేసుకున్నారు. ఈ విషయమై ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘పిశాచాలు కూడా ఇలా చేయరేమో? వారిని రాక్షసులు అని కూడా అనలేం. అందరూ కలిసి సంకరం అయినట్టుంది. ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటున్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇలా చేయగలదు. పూర్తిగా సమన్వయంతో కమ్ముకుని కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఇవేవీ సహజమైనవి కావు, వ్యవస్థీకృతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలే" అని సజ్జల వ్యాఖ్యానించారు.
క్షమాపణ చెప్పేవరకు విడిచి పెట్టేది లేదు: అమరావతి మహిళలు
మరోవైపు రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రజా ప్రతినిధులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. గత ఐదేళ్లూ మహిళలను అనేక ఇబ్బందులకు గురి చేసిన వైఎస్సార్సీపీ, ఆ పార్టీ ఛానల్ సాక్షి ఇప్పుడూ అదే పంథా కొనసాగిస్తోందని మహిళలు ధ్వజమెత్తారు. ఘటనపై జగన్, ఆయన భార్య భారతీరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని మండిపడ్డారు. అమరావతి మీద మొదటి నుంచి విషం చిమ్ముతున్న సాక్షి, ఇప్పుడూ ప్రణాళిక ప్రకారం రాజధాని మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేయించిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు : సీఎం చంద్రబాబు