ETV Bharat / state

యువతి మృతదేహంతో యువకుడి ఇంటి వద్ద ఆందోళన - పోలీసుల ఎంట్రీతో - DEAD BODY ISSUE IN NALGONDA

ప్రేమించి మోసం చేశాడనే మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య - మృతదేహంతో యువకుడు జానారెడ్డి ఇంటి ముందు బంధువుల ధర్నా - హైదరాబాద్​లో యువతి మృతి

DEAD BODY ISSUE IN NALGONDA
DEAD BODY ISSUE IN NALGONDA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 15, 2025 at 8:55 PM IST

2 Min Read

Dead Body Issue In Nalgonda District : ఓ యువకుడు ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే విషయంలో సరూర్​నగర్​లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ మృతురాలి బంధువులు మృతదేహంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆ యువకుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో దహన సంస్కారాలకు ఒప్పుకున్నారు. మృతురాలి బంధువులతో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు ప్రత్యేక హమీ మేరకు ఆందోళన విరమించేలా ఒప్పించారు.

నిందితులను విడిచిపెట్టం : ఈ నేపథ్యంలో డీఎస్పీ మాట్లాడుతూ ఆ యువతి మృతికి కారణమైన వారందరి పేర్లు ఎఫ్ఐఆర్​లో చేర్చేందుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ సరూర్​నగర్ పోలీసులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో నిందితులను వదలబోమని డీఎస్పీ తేల్చి చెప్పారు. బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామని తెలిపారు.

"బొక్కమంతలపహడ్‌కు ధర్మారపు మల్లేశ్వరి అనే యువతి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. దానిలో కొంత మంది నిందితుల పేర్లు చేర్చలేదనే కారణంతో ఆందోళన చేయడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉన్నారో వారి అందరి పేర్లు చేర్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు అక్కడి డీసీపీతో మాట్లాడటం జరిగింది. ఈ కేసులో తప్పకుండా న్యాయం చేస్తాం" రాజశేఖర రాజు, మిర్యాలగూడ డీఎస్పీ

వివరాల్లోకి వెళ్తే : నల్గొండ జిల్లా నిడమనూర్‌ మండల బొక్కమంతలపహడ్‌కు చెందిన కుక్కల జానారెడ్డి, అదే గ్రామంలోని ధర్మారపు మల్లేశ్వరి అనే యువతి ప్రేమించుకున్నారు. ఇటీవల జానారెడ్డి మరో యువతిని వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న మల్లేశ్వరి తీవ్ర మనస్థాపంతో సోమవారం(ఏప్రిల్ 14) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి యువకుడి ఇంటి ముందు పెట్టి ధర్నాకు దిగారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించాలని కోరితే అంగీకరించలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతిరాలి తరఫు బంధువులు అంగీకరించారు.

తల్లిదండ్రుల దేహాలు అగ్నికి ఆహుతవుతుంటే అమ్మా,నాన్న అంటూ చిన్నారుల వేదన - చూసిన వారి గుండె తరుక్కుపోవాల్సిందే!

భార్య మరణం తట్టుకోలేక- ఇద్దరు పిల్లలను చంపి, భర్త ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.