ETV Bharat / state

రూ.10వేలు ఇవ్వలేదని- యజమాని భార్యకు చెందిన 12 తులాల నగల చోరీ - PRODDATUR GOLD THEFT CASE

ప్రొద్దుటూరులో బంగారం చోరీ చేసిన యువకుడు అరెస్ట్‌

Proddatur Gold Theft case
Proddatur Gold Theft case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 10, 2025 at 11:15 AM IST

Updated : February 10, 2025 at 11:39 AM IST

2 Min Read

Proddatur Gold Theft Case : షాప్​లో పనిచేసే సమయంలో డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓనర్​పై కోపం పెంచుకున్నాడు ఆ గుమస్తా. ఆయణ్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడు. యజమాని దుకాణం వద్దకు వెళ్లిన తరువాత ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ముఖానికి మంకీ క్యాప్‌ ధరించి చేతులకు గ్లౌజులు వేసుకుని ఇంటి వద్ద ఒంటిరిగా ఉన్న ఆయన భార్యను బెదిరించాడు. ఆమె శరీరంపై ఉన్న బంగారం ఆభరణాలు లాక్కొని పరారయ్యాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలను వివరాలను ప్రొద్దుటూరు రెెండో పట్టణ ఠాణలో ఆదివారం సాయంత్రం డీఎస్పీ భావన వెల్లడించారు. స్థానిక ఆంధ్రకేసరి రోడ్డుకు చెందిన సుబ్బయ్య, ప్రభావతి దంపతులు త్రీటౌన్ పోలీస్​స్టేషన్ సమీపంలో జనరల్‌ స్టోర్‌ నడుపుతున్నారు. శనివారం ఉదయం సుబ్బయ్య దుకాణానికి వెళ్లారు. ఆయన భార్య ప్రభావతి ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెను బెదిరించి 12 తులాల బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టూటౌన్‌ బైపాస్‌రోడ్డు సమీపంలో ఆర్ట్స్‌ కాలేజీరోడ్డుకు చెందిన ఉచ్చుసాగారి రసూల్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద నుంచి రూ.10 లక్షలు విలువైన బంగారం ఆభరణాలతో పాటు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నాం. నిందితుడు రసూల్‌ సుబ్బయ్య నిర్వహించే జనరల్‌స్టోర్‌లో రెండు సంవత్సరాల నుంచి గుమస్తాగా పనిచేసేవారు. ముక్కుకు సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని, జనవరి నుంచి గుమస్తాగా రాలేననని యజమానికి చెప్పారు.

Proddatur Jewellery Theft Case : డిసెంబర్ నెల జీతంతో పాటు ఆపరేషన్‌కు మరో రూ.10,000లు అదనంగా ఇవ్వాలని కోరగా యజయాని సుబ్బయ్య తర్వాత ఇస్తానని చెప్పారు. ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కూడా జీతం డబ్బులివ్వకుండా కాలం గడుపుతుండటంతో ఓనర్​ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడని డీఎస్పీ భావన పేర్కొన్నారు. దీంతో ప్లాన్ ప్రకారమే ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యజమాని భార్యను బెదిరించి బంగారాన్ని అపహరించాడని చెప్పారు. 12 గంటల్లోనే కేసు ఛేదించన సీఐ యుగంధర్, ఎస్సైలు రాఘవేంద్రరెడ్డి, ధనుంజయడులను అభినందిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

" సుబ్బయ్య, ప్రభావతి దంపతులు జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. నెల జీతం ఇవ్వకుండా బకాయి పెట్టడంతో దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రసూల్‌ యజమాని సుబ్బయ్యపై కోపం పెంచుకున్నాడు. ముఖానికి ముసుగు ధరించి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్న ఆయన భార్యను బెదిరించి రూ.10 లక్షల విలువైన 12 తులాల బంగారం చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్‌ చేశాం." - భావన, డీఎస్పీ

విశాఖలో బైక్ కొట్టేసి తునిలో చైన్ స్నాచింగ్ - "షాకింగ్ విజువల్స్"

చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లల్లో చోరీలు- జల్సాలు- ఇప్పుడేమో కటకటాలు - Police Arrested 3 Chain Snatchers

Last Updated : February 10, 2025 at 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.