ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త విధానం? - అసలేంటి ప్రిఫరెన్షియల్​ విధానం - PREFERENTIAL POLICY FOR JOB RECRUIT

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్​ విధానం - నేటి నుంటి ఎస్సీ వర్గీకరణ ప్రారంభంతో కొత్త విధానం

Preferential Policy for Job Recruitment
Preferential Policy for Job Recruitment (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 14, 2025 at 9:36 AM IST

2 Min Read

Preferential Policy for Job Recruitment : ఇవాళ్టి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా, సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిఫరెన్షియల్​ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే దివ్యాంగులకు ఉద్యోగాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎస్సీల్లోని గ్రూప్​-1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్​-2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేస్తారు. ఒకవేళ గ్రూప్​-2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్​-3లోని అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

ఒకవేళ గ్రూప్​-1,2,3 మూడింటిలోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్​ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రిఫరెన్షియల్​ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలు అవుతోంది. ఈక్రమంలో ఎస్సీ వర్గీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభించడం వల్ల ఈ విధానాన్ని ఎస్సీ అభ్యర్థులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.

మూడో రోస్టర్​ పాయింట్​ గ్రూప్​-2 కులాలకు : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్​ పాయింట్లు ఎంతో కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్​, దివ్యాంగుల రిజర్వేషన్​ శాతాల ప్రకారం ఇవి ఉంటాయి. అయితే ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్​ రోస్టర్​ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించింది. ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్​-1కు ఒకటి, గ్రూప్​-2కు తొమ్మిది, గ్రూప్​-3కు ఐదు రోస్టర్​ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో 100 పాయింట్లు రోస్టర్​ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్​ పాయింట్​ గ్రూప్​-2లోని కులాలకు దక్కనుంది. అలాగే రెండో రోస్టర్​ పాయింట్​ గ్రూప్​-1లోని కులాలకు లభిస్తుంది. గ్రూప్​-2లోని కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉండటంతో మూడో రోస్టర్​ పాయింట్​ గ్రూప్​-2 కులాలకు రానుంది. నాలుగో రోస్టర్​ పాయింట్​ గ్రూప్​-3లోని కులాలకు లభించనుంది.

మొత్తం రోస్టర్​ పాయింట్లలో ఎస్సీల్లోని గ్రూపులకు దక్కేవి :

  • గ్రూప్‌-1: 7
  • గ్రూప్‌-2: 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97
  • గ్రూప్‌-3: 22, 41, 62, 77, 91

గ్రూప్​ 1 పోస్టుల సర్టిఫికెట్​ వెరిఫికేషన్ తేదీలు ఖరారు చేసిన టీజీపీఎస్సీ - అభ్యర్థులకు సూచనలివే!

నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం - తొలి కాపీ సీఎం రేవంత్​ రెడ్డికి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.