ఈ యాప్‌లు మీ ఫోన్లో ఉంటే - సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఏం చేయలేరు!
రోజు రోజుకూ అధికమౌతున్న సైబర్ మోసాలు - బాధితుల నుంచి భారీమొత్తంలో నగదు కాజేస్తున్న నేరగాళ్లు - ఈ యాప్‌లను వినియోగించడంతో మోసాలను అరికట్టవచ్చంటున్న అధికారులు

Published : September 17, 2025 at 3:26 PM IST
How To Avoid Cyber Fraud In Telugu : ఖరీదైన ఫోన్ ఎప్పుడైనా చెయ్యి జారి కిందపడుతుందేమో? అని భయపడుతుంటాం. రూ. వందల ఖర్చుకు వెనుకాడకుండా పౌచ్ కొంటాం. కానీ, రోజు వారీగా వినియోగించేపటప్పుడు, సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యాంగా వ్యవహరిస్తుంటాం. దీనినే ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాలు భారీగా నమోదయ్యాయి. వీరి బారిన పడ్డవారినుంచి లక్షల్లో కాజేశారు. తరచూ ఈ విధంగా జరిగే మోసాలు, వాటి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిజామాబాద్ సైబర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు సూచనలిచ్చారు.
1. డిజిటల్ అరెస్టు : ఇటీవల నిజామాబాద్ పట్టణంలో విశ్రాంత ఉద్యోగి దంపతులను డిజిటల్ అరెస్టు అని మోసగించిన నేరగాళ్లు వారిని 50 గంటల పాటు నిర్బంధించారు. వారి బ్యాంకు ఖాతాలోంచి రూ.30 లక్షలకు పైగా మళ్లించుకున్నారు. సుమారు రెండు రోజుల పాటు కేవలం భయంతో, ఏ ఆలోచన చేయకుండా ఇంటికే పరిమితమైన వైనం పోలీసులను ఆశ్చర్యపరిచింది.

1. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసే యాప్ : ఇటువంటి సైబర్ మోసాలు జరగకుండా ఉండేందుకు సైబర్ బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు వాటినుంచి మనల్ని అప్రమత్తం చేసేందుకు 'ఎం-కవచ్ 2' యాప్ అందుబాటులో ఉంది. ఇది డిజిటల్ గోప్యతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఫోన్‌కు మెసేజులు, మెయిల్స్ రూపంలో నిషేధిత లింకులు వచ్చినా, నిషేధిత యాప్‌లు ఉన్నా వాటిని గుర్తించి మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇది ఫోన్లోని భద్రత లోపాలను సులభంగా పసిగట్టి మన స్మార్ట్ ఫోన్‌కు భద్రత కల్పిస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. వీలైనంత త్వరగా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి.
2. డేటా చోరీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంజ్‌లో ఓ వ్యక్తి స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నాడు. మరుసటిరోజు ఫోన్ పోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలోంచి రూ.1.50 లక్షలు మాయమయ్యాయి. అయితే మన ఫోన్ లాక్‌ను ఇతరులు తెవరడం అసాధ్యం. పిన్ నంబర్లు, ఇతర సమాచారంలో ఖాతాల్లోకి చొరబడలేరు అని అనుకుంటుంటాం. కాని అదంతా అపోహే.
3. సంచార్ సాథీ యాప్ : ఫోన్ పొరపాటున పోయినట్లయితే వేరొకరు దాని లాక్ తెరిచి వ్యక్తిగత వివరాలు తెలుసుకోకుండా 'సంచార్ సాథీ' యాప్‌తో బ్లాక్ చేయవచ్చు. అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు ఇవ్వొచ్చు.
4. ఫోన్ మిస్సింగ్ కేసులు : ఫోన్లు దొంగతనానికి గురయ్యాయని లేదా ఫోన్ పోగొట్టుకున్నామంటూ జిల్లాలో రోజుకు 16-20 ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని కొట్టేసినా, చేజార్చుకున్నా వెంటనే ఫిర్యాదిస్తే తిరిగి రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అవగాహన పెరగాల్సి ఉంది.
5. సీఈఆర్ వెబ్‌పోర్టల్ : ఓ బాధితుడు ఫోన్ పోయిందని దాని మోడల్, ఐఎంఈఐ నెంబరు తదితర వివరాలతో పోలీసులకు ఫర్యాదు చేశాడు. 'సీఈఆర్' వెబ్‌పోర్టల్‌లో వివరాలు నమోదు చేసిన మూడు రోజులకు లొకేషన్‌ను గుర్తించి ఫోన్‌ను రికవరీ చేశారు. ఎవరైనా ఈ వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్‌ను బ్లాక్, అన్‌బ్లాక్ చేయవచ్చు.
- జిల్లాలో మాయమైన ఫోన్లు : 4,000
- రికవరీ అయిన ఫోన్లు : సుమారు 800
రూ.15 వేలు లాభం చూపి రూ.6.8 కోట్లు కొట్టేశారు
అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చే సిమ్ బాక్స్ - హైదరాబాద్‌లో ముఠా సభ్యుల అరెస్ట్

