ETV Bharat / state

వేసవిలో ప్రయాణాలు చేస్తున్నారా? - అయితే వాహనాల్లో ఇవి చెక్​ చేయండి - SUMMER TRAVEL TIPS TO MOTORISTS

వేసవి ప్రయాణాలు చేస్తున్నారా - అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తులు ఏంటో తెలుసా - వాహనాలపై జాగ్రత్త వహించాలంటున్న నిపుణులు

Precautions to be Taken By Motorists while Traveling
Precautions to be Taken By Motorists while Traveling (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 28, 2025 at 11:20 AM IST

2 Min Read

Precautions to be Taken By Motorists While Traveling : వేసవి వచ్చిందంటే చాలు సెలవులు సద్వినియోగం చేసుకునేందుకు కుటుంబంతో విహార యాత్రలకు వెళ్తుంటారు. దూర ప్రయాణాలు చేస్తుంటారు. ఏటా శ్రీశైలం, తిరుపతి, కేరళ, కర్ణాటక, అరుణాచలం, విశాఖపట్నం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. సుదూర ప్రయాణాలు అందునా వేసవిలో సొంత వాహనం, అద్దె వాహనం అయినా సరి చూసుకోవటం చాలా ముఖ్యం. ఇటీవల శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఐదు నెలల్లో రెండు కార్లు దగ్ధమయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండల కేంద్రం సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్‌ దారిపై ఓ ద్విచక్రవాహనానికి అకస్మాత్తుగా మంటలు వచ్చి యువకుడు మరణించాడు.

హైదరాబాద్‌- బెంగుళూర్‌ జాతీయ రహదారిపై తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణనష్టం తక్కువే కానీ వాహనాలు మాత్రం పూర్తిగా దగ్ధమై భారీగా నష్టపోయారు. వేసవిలోనే కార్లు, ఇతర వాహనాలు మంటల బారిపడి దగ్ధమవుతుండటంపై వాహనదారులు దృష్టి సారించాల్సి అవసరముంది. అప్రమత్తంగా ఉంటూ నిత్యం వాహనాన్ని గమనిస్తుండాలి. వాహనానికి కావాల్సిన పరికరాలు, ఆయిల్​, ఇతర వస్తువులను సరిచూసుకుని ప్రయాణాలు చేయడం వ్లల ప్రమాదాల బారి నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

పాత వాహనాలను ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి. యాత్రలకు వెళ్లే ముందు వాహనాలను సర్వీసింగ్​ చేయించాలి. ఇంజిన్, బ్రేక్, కూలెంట్, ఏసీ ఆయిల్‌ తనిఖీ చేసుకోవాలి. ఫ్యాన్‌ బెల్టు, రేడియేటర్‌ను సరి చేయించాలి. బ్యాటరీలో డిస్టల్‌ వాటర్‌ లెవల్‌ను సరి చూసుకోవాలి. ఇంజిన్‌లో ఎలక్ట్రికల్‌ తీగలు తుప్పు పట్టకుండా చెక్​ చేసుకుంటూ ఉండాలి. డ్రైవర్​ ప్రతి రెండు వందల కిలోమీటర్లకు ఒకసారి వాహనం కాసేపు ఆపితే మంచిది.

ఘాట్ రోడ్డు ఎక్కే ముందు వాహనాలను కాసేపు ఆపాలి. కొండ పైకి ఎక్కే ముందు ఏసీని ఆఫ్‌ చేస్తే ఇంజిన్‌పై భారం తగ్గుతుంది. బ్రేకులు, కూలెంటు, ఇంజిన్‌ ఆయిల్‌ను చెక్‌ చేసుకోవాలి. కొండ దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్‌ వాడకుండా, ఇంజిన్‌ బ్రేకింగ్‌ వాడాలి.

  • శ్రీశైలం ఘాట్‌ రోడ్డు : మన్ననూరు నుంచి పాతాల గంగ వరకు 60 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది.
  • హైదరాబాద్‌ - శ్రీశైలం నేషనల్​ హైవే నంబరు 765 వెల్దండ మండలం నుంచి అచ్చంపేట మండలం వరకు 46 కిలోమీటర్లు విస్తరించింది.
  • మహబూబ్​నగర్​ జిల్లా పరిధిలో 167 కిలోమీటర్ల విస్తరించిన కోదాడ - రాయచూర్‌ జాతీయ రహదారి నంబరు 167పై వాహనాల రాకపోకలు అధికంగా సాగుతాయి.
  • కల్వకుర్తి - కరివెన 176 -కె నేషనల్ హైవే దూరం 71 కిలో మీటర్లు.
  • హైదరాబాద్‌ - కర్నూల్‌ నేషనల్​ హైవే 44 నంబరు రహదారి జిల్లా పరిధిలో 116 కిలోమీటర్ల దూరం ఉంది.

ప్రయాణ సమయంలో డ్రైవరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కల్వకుర్తి ఎంవీఐ అశోక్​కుమార్ తెలిపారు​. ముఖ్యంగా రాత్రి, పగలు ఒక్కడే వాహనం తోలించరాదన్న ఆయన నడుపుతున్న వాహనం కండీషన్‌ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని చెప్పారు. వేసవిలో రేడియేటర్, ఎలక్ట్రీషియన్, ఆయిల్‌ను గంట గంటకు తనిఖీ చేసుకోవాలని సూచించారు. టైర్లను అనుక్షణం పరిశీలించాలన్న ఆయన వేసవిలో వేడెక్కి పగిలే ప్రమాదం ఉందన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలతో యాత్ర ఆనందంగా సాగించవచ్చని తెలిపారు.

వేసవి సెలవులు - ఈ 50 రోజుల్లో ఇలా చేస్తే బంగారు భవితకు బాటలు

విహార యాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? - మీ కోసమే ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - Summer Special Trains

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.