ETV Bharat / state

నెలల తర్వాత ఏసీ వాడుతున్నారా? - అయితే ఇవి చెక్‌ చేసి వాడితే బెటర్!

చాలా కాలం తర్వాత ఏసీని తిరిగి ఉపయోగిస్తున్నారా - ఈ జాగ్రత్తలు పాటిస్తూ, వాడాలంటున్న నిపుణులు

AC Usage Tips and Precautions in Telugu
AC Usage Tips and Precautions in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 23, 2025 at 7:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

AC Usage Tips and Precautions in Telugu : ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ చల్లదనం చూసుకుంటారు. అరగంట బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా కాలంగా వాడకుండ వదిలేసిన కూలర్లు, ఏసీలను ఇప్పుడు వాడుతుంటారు. బయట నుంచి రాగానే ఫస్ట్‌ ఏసీ ఆన్ చేస్తారు. అలా కొన్ని నెలల పాటు వాడకుండా వదిలేసిన ఏసీని ఇప్పుడు ఉపయోగిస్తారు. కానీ అలా డైరెక్ట్‌గా వాడకుండా వదిలేసి, ఒక్కసారిగా వాడడటం మొదలెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పలువురు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

  • ఏసీని వాడేముందు మెకానిక్‌తో ఏసీని సర్వీసింగ్ చేయించాలి. ఏవైనా లోపాలుంటే సీజన్ మధ్యలో మొరాయించకుండా ఉంటుంది.
  • ఫిల్టర్లను బిగించే కండేన్సేషన్ పైపుల్లో వాటర్ పోసి పరీక్షించాలి. ప్రవాహానికి అడ్డుపడేవి ఏమైనా ఉంటే తీసేయాలి.
  • ఫిల్టర్లను వాడే ముందు శుభ్రం చేయాలి. వాటిలో పేరుకున్న ధూళిని దులపాలి. లేకుంటే గాలి సాఫీగా సాగడానికి అడ్డుపడి ఏసీ సామర్థ్యాన్ని 5-15 శాతం వరకు దెబ్బతీస్తుంది.
  • ఏసీ గాలి వీచే ద్వారాలను శుభ్రం చేయాలి పైపులకు లీకేజీ ఉందా చేక్‌ చేయాలి. ఉంటే మార్చాలి.
  • ఏసీ టెక్నీషియన్‌తో స్విచ్‌లు, ఏసీ గ్యాస్, అంతర్గత వ్యవస్థలో అన్ని సవ్యంగా పనిచేస్తున్నాయా? లేదా? పరీక్షించాలి.
  • రిమోట్‌తో గదిలో 23-27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండేలా చూడాలి. తక్కువ ఉంటే ప్రతి డిగ్రీకి విద్యుత్తు వినియోగం పెరుగుతుంది.
  • గది మొత్తం ఏసీ ఆన్ చేసినప్పుడు చల్లదనం విస్తరించడానికి ఫ్యాన్‌ ఉపయోగించాలి. ఫలితంగా గది వేగంగా చల్లబడుతుంది.
  • గదిలో సూర్యరశ్మి పడకుండా చూడాలి. గదిలో వేడి ప్రసరిస్తుంటే ఏసీ వినియోగించినా చల్లబడక కరెంటు బిల్లు పెరుగుతుంది.
  • ఏసీ ఆన్ చేసినప్పుడు బయట గాలి లోపలికి రాకుండా చూసుకోవాలి. లేదంటే బయట వేడి గాలి లోపలికి వచ్చి రూమ్ చల్లగా అవ్వడానికి సమయం పడుతుంది. దీంతో విద్యుత్‌ ఎక్కువ ఖర్చవుతుంది.
  • చాలా సేపు ఏసీ ఆన్‌ చేసి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఆటో మోడ్‌తో అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ఆన్ చేసి పెడితే గది చల్లబడిన తర్వాత ఏసీ ఆఫ్ అవుతుంది. మళ్లీ గదిలో వేడి పెరుగుతుంటే ఆన్ అవుతుంది.