Postal Dept Accident Insurance Scheme : అనుకోని ఘటన జరిగినప్పుడు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతాం. కొన్నిసార్లు పాక్షికంగా, లేదంటే తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత బీమా (పర్సనల్ ఇన్సూరెన్స్) చాలా అండగా ఉంటుంది. ఇందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సామూహిక ప్రమాద బీమాను ప్రారంభించింది. ఆయా సంస్థలు నిర్ణయించిన వార్షిక ప్రీమియం అమౌంట్‌ను చెల్లిస్తే చాలు, రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. కాగా ఇండియన్ పోస్టల్ పేమెంటు బ్యాంకు (ఐపీపీబీ) ద్వారా ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

బీమా ఇలా :
- 18-65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారంతా ఈ వ్యక్తిగత బీమాకు (పర్సనల్ ఇన్సూరెన్స్‌కు) అర్హులు.
- ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.
- యాక్సిడెంట్ జరిగి బీమా తీసుకున్న వ్యక్తి వైద్యం కోసం హాస్పిటల్లో చేరితే ఐపీడీ (ఇన్ పేషెంట్ డిపార్ట్‌మెంటు) కింద రూ.లక్ష క్లెయిమ్ చేస్తారు.
- హాస్పిటల్లో రోజువారీ నగదుగా 10 రోజుల వరకు నిత్యం రూ.వేయి చెల్లిస్తారు.
- విద్య ప్రయోజనానికి గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు రుసుములో 10 శాతం లేదా రూ.లక్ష వరకు ఎంచుకోవచ్చు.
- ఫ్యామిలీ ప్రయోజనాలకు రూ.25 వేలు, అంత్యక్రియలకు రూ.5 వేలను అందిస్తారు.
"ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరం. తక్కువ మొత్తంలో చెల్లించి ఎక్కువ పరిహారం పొందేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఆరోగ్య విషయమై పోస్టాపీసులో బీమా చేసుకోవాలి"- వెంకటేశ్వర్లు, తపాలా సూపరింటెండెంట్, సూర్యాపేట
ఏడాదికి 2 వేలతోనే - రూ.40 లక్షల ప్రమాద బీమా! - కుటుంబానికి SBI రక్ష