ETV Bharat / state

ఒక్క క్లిక్​తో మీ ఫోన్​లోనే పోస్టాఫీసు సేవలు - ఈ యాప్​ డౌన్​లోడ్​ చేసుకుంటే చాలు - POST INFO APP INFORMATION

మెల్లిగా డిజిటల్​ రంగం వైపు అడుగులేస్తున్న తపాలా శాఖ - ఒక్క క్లిక్​తోనే అన్ని సేవలు మీ ఫోన్​లో - కొత్త పోస్టల్ యాప్​ తీసుకొచ్చిన తపాలా శాఖ

Postal Department Post Info App
Postal Department Post Info App (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 11, 2025 at 11:50 AM IST

2 Min Read

Postal Department Post Info App : తపాలాశాఖ నూతన ఒరవడిలోకి అడుగులు వేస్తోంది. అదే డిజిటల్​ రంగం. ప్రజలకు తపాలా సేవలను మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో పోస్ట్​ ఇన్ఫో పేరుతో కొత్త మొబైల్​ యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్​ ద్వారా వినియోగదారులు పంపే వస్తువులు, స్పీడ్​ పోస్టులను సులభంగా ట్రాక్​ చేయవచ్చు. అలాగే సమీపంలోని పోస్టాఫీసు వివరాలను సైతం తెలుసుకోవచ్చు. ఎంత దూరానికి ఎంత పోస్టల్​ ఛార్జీ అవుతుందో ముందుగానే ఇందులో లెక్కించుకునే సౌకర్యం కల్పించారు. అలాగే తపాలా శాఖ అందించే పొదుపు పథకాల వివరాలు సైతం ఇందులో చూసుకోవచ్చు.

పోస్ట్​ ఇన్ఫో యాప్​ను గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవాలి. ఈ యాప్​ ద్వారా పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రజలకు సేవలు నేరుగా ఫోన్​లో అందించాలనే లక్ష్యంతో తపాలాశాఖ ఈ యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఏఏ సేవలు అందిస్తుందో చూద్దాం.

  • ఛార్జీల లెక్కింపు : వివిధ సేవల రుసుముల వివరాలను ఈ యాప్​లో తెలుసుకోవచ్చు. పంపించే వస్తువుల బరువుల వివరాలను నమోదు చేసి దాని ఆధారంగా ఎంత ఛార్జీలను చెల్లించాలో ముందే తెలుసుకోవచ్చు.
  • ట్రాకింగ్​ : మనం పోస్టు చేసిన ఉత్తరాలు, వస్తువులు ఎక్కడ ఉన్నాయి? పంపించిన వారికి అవి ఏ సమయంలో అందాయనే వివరాలను తెలుసుకోవచ్చు.
  • లొకేషన్​ సెర్చ్​ : మీరు పోస్టాఫీసు వివరాలు కావాలంటే ఆయా ప్రాంతాల పిన్​కోడ్​ నంబర్లు నమోదు చేస్తే తపాలా కార్యాలయం పేరు, డివిజన్​ పరిధిని చూపిస్తోంది. అలాగే తపాలా సేవలు ఎలా ఉన్నాయని చెప్పేందుకు ఫీడ్​ బ్యాక్​ ఆప్షన్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • పొదుపు, బీమా పథకాల సమాచారం : తపాలా బీమా పథకాల గురించి, సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్​ డిపాజిట్​ పథకానికి సంబంధించి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు చేసే ధరావత్తులపై ఆదాయాన్ని లెక్కించుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీరేట్ల ఆధారంగా పథకాలను ఎంచుకోవచ్చు. డిపాజిట్​ చేయడంతో వచ్చే ఆదాయ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.
  • సర్వీస్​ రిక్వెస్టు : పోస్ట్​ ఇన్ఫో యాప్​ ద్వారా నగదు పొందవచ్చు. కొత్త మదుపు పథకాలు, తపాలా స్టాంప్స్​ తీసుకోవచ్చు. ఈ సేవలు పొందాలంటే సర్వీసు రిక్వెస్టు వారికి పంపితే చాలు ఇంటికే అవి చేరుతాయి. తపాలా బీమా పథకాలు పొందాలని అనుకుంటే బీమా పోర్టల్​లో వివరాలను నమోదు చేయాలి. తపాలాశాఖ వారు ఇంటికే వచ్చి బీమా అందిస్తారు.
  • ఫిర్యాదుల నమోదు: తపాలా సేవలపై ఫిర్యాదు చేయడానికి యాప్‌లో రిజిస్టర్‌ కంప్లైంట్‌ అనే విభాగంలోకి వెళ్లి అందులో క్లిక్‌ టు రిజిస్టర్‌లో సేవలపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమయంలో వచ్చిన నంబరు అధారంగా కంప్లైంట్‌ ట్రాకింగ్‌లో నమోదు చేస్తే ఫిర్యాదు ప్రస్తుత స్థితి తెలుసుకోవచ్చు.

పుస్తకాలు, పత్రికలు పోస్టల్​ ద్వారా తెప్పించుకుంటున్నారా - ఇక బాదుడే బాదుడు

పోస్టాఫీస్​ సూపర్ స్కీమ్ - రోజూ రూ.95 పెట్టుబడితో రూ.14 లక్షలు మీ సొంతం! - Ggram sumangal yojana scheme

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.